ఓవైసీకి దమ్ముంటే ఆ పని చేయాలి... మోదీ దీపం వెలిగించమంటే?

శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:59 IST)
హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన ఓవైసీపై సంజయ్ ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా డాక్టర్లపై పలువురు ద్రోహులు భౌతిక దాడులకు దిగినా వైద్యులు సహనంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
 
'కరోనా బారిన పడి వేలమంది బాధపడుతుంటే ఓవైసీ హాస్పిటల్‌ను ఐసోలాషన్ వార్డుకు ఇచ్చి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని అని మండిపడ్డారు.  ఆయనకు దమ్ముంటే డాక్టర్లపై, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లలపై దాడులను ఆపాలని సవాలు విసిరారు. పేదప్రజలకు ఇబ్బంది పడకూడదని.. కేంద్ర ప్రభుత్వం బియ్యం, పెన్షన్, గ్యాస్, జనాధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. వైద్యులకు మనోధైర్యం అందించే ఐక్యత కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలి. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. 
 
 కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఓవైసీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి హితవుపలికారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఫ్యాంటు విప్పి నర్సును పక్కలోకి పిలిచిన జమాత్ సభ్యుడు... ఎన్ఎస్ఏ ప్రయోగం