Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు

Advertiesment
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు
, బుధవారం, 15 డిశెంబరు 2021 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం చెలరేగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ వైరస్ బారిన ఇద్దరు రోగులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 
 
ఈ ఇద్దరు రోగులు సోమాలియా, కెన్యా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన ఓ బాలుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్ అవతారమెత్తిన విజ‌య‌వాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్