Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురి స్నేహితురాలితో అక్రమ సంబంధం, అలా చేసినందుకు గొంతులో పొడిచేసింది

Advertiesment
man
కూతురి స్నేహితురాలితో శారీరక బంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఉత్తర చెన్నైకి చెందిన అమ్మన్‌శేఖర్‌ కర్పూరం వ్యాపారి. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె స్నేహితురాలు సునీతతో అమ్మన్‌ శేఖర్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. యువతికి బహుమతులు, నగదు ఇస్తూ యువతితో తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు.
 
ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు యువతి నగ్న వీడియోలు తీసి లీక్ చేస్తానని బెదరించాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతి, శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది.
 
సోమవారం ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. దీంతో యువతి అతడిపై మత్తు మందు స్ప్రే చేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచి పారిపోయింది. శేఖర్‌ అక్కడే కుప్పకూలి కొంత సమయానికే మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడి సెల్ ఫోన్లో ఫోటోలు, నెంబర్లను పరిశీలించగా సునీత నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్త జన సందోహంతో కిట‌కిట‌లాడుతున్న పున్నమీ ఘాట్