Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుసగా నాలుగో ఏడాది ‘ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్’గా విర్టుసాకు గుర్తింపు

వరుసగా నాలుగో ఏడాది ‘ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్’గా విర్టుసాకు గుర్తింపు
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:02 IST)
వినూత్నమైన ఇంజనీరింగ్ ద్వారా, క్లయింట్లు మార్కెట్లని మార్చేందుకు, డిజరప్ట్ చేసేందుకు దోహదం చేసే, డిజిటల్ స్ట్రేటజీ, డిజిటల్ ఇంజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందజేసే ఒక సంస్థ అయిన విర్టుసా కార్పొరేషన్, తన లెర్నర్స్ వీక్ 2020కిగాను అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్‌మెంట్ (ఎటిడి) నుంచి గుర్తింపు పొందినట్టు ప్రకటించింది. ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్ సర్టిఫికెట్‌ను విర్టుసా వరుసగా నాలుగో సంవత్సరం అందుకుంది. కంపెనీ నిర్వహించిన లెర్నర్స్ వీక్ 2020 డిసెంబర్ 7 నుంచి 11 మధ్య జరిగింది.
 
విర్టుసా లెర్నర్స్ వీక్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక కార్యక్రమం, దీనిలో కంపెనీ నిర్వహించే అన్ని విద్యా సంబంధమైన కార్యక్రమాలూ జరుగుతాయి, పాల్గొన్నవారికి వారి అభ్యాసన లక్ష్యాల దిశగా తదుపరి స్థాయికి చేరుకొనే ఒక అవకాశాన్ని ఇవి అందజేస్తాయి. ఈ ఏడాది కార్యక్రమంలో 240 కోర్సులను అందజేయడం జరిగింది, వాటిలో సాంకేతికత, ప్రాసెస్‌లు, డొమైన్, ప్రవర్తనా సంబంధమైన, సమాచార నైపుణ్యాలకు చెందిన వివిధ విభాగాలు ఉన్నాయి. 3,500 మందికి పైగా అభ్యర్థులు 7,500 గంటల పైచిలుకు శిక్షణలో భాగస్వాములయ్యారు.
 
విర్టుసా నాయకుల నుంచీ, నిపుణుల నుంచీ నేర్చుకోవడానికీ, విలువైన పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వీలుగా సహచరులతో ప్రత్యేకమైన ఆలోచనా ప్రేరక తరగతుల్లో పాల్గొనడానికీ ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. లెర్నక్స్ వీక్ చివరిలో, ఈ కార్యక్రమాన్ని ఎటిడి దృష్టికి విర్టుసా తీసుకువెళ్ళింది, వరుసగా నాలుగో సంవత్సరం ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్ సర్టిఫికెట్ అందుకుంది. ఎటిడి ఉద్యోగుల అభ్యాసన వారంలో పాల్గొన్న సంస్థల మధ్య ఈ సర్టిఫికెట్‌ ప్రదానం జరిగింది. నైపుణ్యాభివృద్ధిలో తమ అంకితభావాన్ని ప్రదర్శించడానికీ, అందుబాటులో ఉన్న అన్ని అభ్యాసన, అభివృద్ధి అవకాశాలను జట్టు సభ్యులకు గుర్తు చేయడానికీ కంపెనీలకు ఇదో అవకాశాన్ని అందించింది.
 
 “మా అభ్యాసన బోధన ప్రణాళికలో భాగస్వాములు అవడం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో విర్టుసా సభ్యులు తమ అంకితభావాన్ని ప్రదర్శించారు” అని సుందర్ నారాయణన్, ఇవిపి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, విర్టుసా తెలిపారు. “కిందటి ఏడాది ప్రపంచం సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా 3,500 మంది సభ్యులు అయిదు రోజుల పాటు 7,500 గంటల అభ్యసనంలో పాలుపంచుకున్నారు. మారుతున్న ఈ వ్యాపార వాతావరణంలో, మారుమూల కార్యాలయంతో సహా, ఎక్కడి నుంచయినా తప్పనిసరిగా, ఎక్కడికైనా అభివృద్ధి అనుభవాలను జట్టు సభ్యులకు అందుబాటులోకి తేవడంలోని ప్రాధాన్యాన్ని ఇది పునరుద్ఘాటిస్తోంది” అని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక రెచ్చిపోనున్న కొడాలి నాని, వారిద్దరే టార్గెట్