Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. AP_Skillలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. AP_Skillలో ఉద్యోగాలు
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (20:07 IST)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అనంతపురం జిల్లాకు చెందిన అసాహీ ఇండియా గ్లాస్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీని ప్రకటనలో పేర్కొనలేదు.
 
ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ విభాగంలో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 2018, 19, 20 సంవత్సరాల్లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
 
ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని Gudipalli/Somendapalliలోని కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ని రోజులని నా భార్య చీవాట్లు భరించేది, అందుకే: నటుడి ఆత్మహత్య, భార్య-అత్తపై కేసు