పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానిపై ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది.
ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉంటాయని, కానీ వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపున న్యాయవాది తమ వాదనలను వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పునిచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు రావడంపై సంతోషంలో ఉన్నారు వైసిపి కార్యకర్తలు, కొడాలి నాని.
దీంతో కొడాలి నాని తిరిగి ఎన్నికల కమిషనర్‌తో పాటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్సలు చేసే అవకాశం ఉందంటున్నారు. అందులోను పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.