Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం : వార్తల షేరింగ్ బంద్... ఎక్కడ?

ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం : వార్తల షేరింగ్ బంద్... ఎక్కడ?
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:20 IST)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. వార్తల షేరింగ్‌ను బంద్ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇకపై వార్తలు షేర్ చేయకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం న్యూస్ ఫీడ్‌ను బ్లాక్ చేసింది. అయితే, ఇది కేవలం ఆస్ట్రేలియా దేశస్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది 

వార్తలు షేర్ చేస్తే సంబంధిత మీడియా సంస్థలకు సోషల్ మీడియా సైట్లు చెల్లింపులు చేయాలన్న ఆ దేశ కొత్త చట్టం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. అయితే, దాని ప్రభావం ఒక్క వార్తల మీదే పడలేదు. అత్యవసర విభాగాలపైనా పడింది. అగ్నిమాపక విభాగం, ఆరోగ్య శాఖ, వాతావరణ శాఖతో పాటు పలు అత్యవసర సేవలకు సంబంధించి వార్తా సమాచారం ఆగిపోయింది. 

దీనిపై ఆయా విభాగాలు, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అత్యవసర సేవల పేజీల్లో వార్తలను ఎలా బ్లాక్ చేస్తారని మండిపడ్డారు. దీంతో ఫేస్‌బుక్ స్పందించింది. ప్రభుత్వ పేజీలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఇవ్వాళ్టి నిర్ణయ ప్రభావం వాటిపై పడబోదని స్పష్టతనిచ్చింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల పేజీలకూ ఈ బాధ తప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడ్జికి 12 ప్యాకెట్లు కండోమ్‌లు పంపిన మహిళా కార్యకర్త..