Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్‌ యుజీ 2022లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఏడుగురు ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థులు

Advertiesment
Akash
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (16:50 IST)
హైదరాబాద్‌లోని ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థులు ఏడుగురు ఇనిస్టిట్యూట్‌‌కు గర్వకారణంగా నిలుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్‌) యుజీ 2022లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌లను సాధించి తన తల్లిదండ్రులకు- ఇనిస్టిట్యూట్‌ వద్ద మొత్తం సిబ్బందికి గర్వకారణంగా నిలిచారు.

 
అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్షలో టాప్‌ స్కోరర్లు- యశ్‌ సేథీ (67), రుమైసా జైనాబ్‌  ఖాన్‌ (158); త్రిశాల అర్రాబెల్లీ (265); అక్షత్‌ కొల్ల (318); భరత్‌ గోయల్‌ (324); యరమడ  మనోప్రీత్‌ రెడ్డి (336); జిల్‌ పటేల్‌ (466)  ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నేడు ప్రకటించింది.
 

ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన నీట్‌లో ర్యాంకు సాధించేందుకు ఆకాష్‌ బైజూస్‌‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌- లైవ్‌ ప్రోగ్రామ్‌‌లో వీరు చేరారు. కాన్సెప్ట్స్‌ అర్థం చేసుకోవడం, అభ్యాస షెడ్యూల్స్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం కారణంగానే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన వారి సరసన తాము నిలువగలిగామన్నారు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ తమకు ఈ రెండు అంశాలలోనూ ఎంతగానో తోడ్పడింది. వారి కోచింగ్‌, కంటెంట్‌ కారణంగానే అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన బోధనాంశాలను మెరుగ్గా ఆకలింపు చేసుకోవడం సాధ్యమైంద’’ని వారు  వెల్లడించారు

 
విద్యార్థులను అభినందించిన శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్‌ బైజూస్‌ మాట్లాడుతూ, ‘‘ అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మేము అభినందిస్తున్నాము. దేశ వ్యాప్తంగా నీట్‌ 2022 కోసం 16 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అతను సాధించిన విజయం, అతని కష్టం అంకితభావంతో పాటుగా అతని తల్లిదండ్రుల మద్దతు గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను అతను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ, మహమ్మారి కాలంలో ఆకాష్‌ బైజూస్‌ ఓ అడుగు ముందుకువేసి విద్యార్థులు నీట్‌‌లో మంచి పర్సంటైల్‌ స్కోర్స్‌ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ‘‘మా విద్యార్థులకు డిజిటల్‌గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. స్టడీ మెటీరియల్స్‌, క్వశ్చన్‌ బ్యాంక్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాము. వర్ట్యువల్‌గా మోటివేషనల్‌ సదస్సులు, పరీక్షలకు సంసిద్ధం కావడంపై సెమినార్లు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యంపై సదస్సులు నిర్వహించాం. మా కష్టం ఫలించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు సాధించిన స్కోర్‌ షీట్స్‌లో అది ప్రతిబింబిస్తుంది. మా విద్యార్థులలో చాలామంది భారతదేశంలో అగ్రశ్రేణి మెడికల్‌ కాలేజీలలో ప్రవేశాలు పొందగలరు’’అని అన్నారు.
 
అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌), డెంటల్‌ (బీడీఎస్‌), ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీయుఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ మొదలైనవి) కోర్సులలో భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశం కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్‌‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తాకోడళ్ళ గొడవ : తండ్రి అండతో నానమ్మను హత్య చేసిన మనవడు