Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తాకోడళ్ళ గొడవ : తండ్రి అండతో నానమ్మను హత్య చేసిన మనవడు

Advertiesment
murder
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (15:47 IST)
అత్తాకోడళ్ళ మధ్య గొడవ జరిగింది. దీంతో తండ్రీ తనయులు కలిసి ఓ దారుణానికి పాల్పడ్డారు. తండ్రి అండతో మనవడు నానమ్మను కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కేశవ్ నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కేశవ్ నగరుకు చెందిన ఉషా విఠల్ గైక్వాడ్ (64) దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. ఆమె పదవీ విరమణ తర్వాత కేశవ్ నగరులో స్థిరపడ్డారు. ఇంటో ఆమెతో పాటు కుమారుడు సందీప్ గైక్వాడ్ (45), కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ (20)లు ఉంటున్నారు. అయితే, అత్తాకోడళ్ల మధ్య  తరచూ గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ క్రమంలో గత నెల 5వ తేదీన మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్న ఉష విఠల్ ఇంట్లో నిద్రపోతుండగా మనవడు సాహిల్ ఆమెను స్నానాల గదిలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన తండ్రితో కలిసి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. 
 
చెట్లను నరికే ఎలక్టిర్క కట్టర్‌తో వృద్ధురాలి శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను మూటల్లో కుక్కి కుట్టేశారు. ఆ బ్యాగులను కారులో తీసుకెళ్లి ముథా నదిలోని నీటిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగును వదిలివేశారు. ఆ తర్వాత వృద్ధురాలి పేరుతో మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, తన మృతి కేసులో అన్న సందీప్‌పై చెల్లికి అనుమానం వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో తల్లిని చంపేందుకు సహకరించిన సందీప్‌తో పాటు అతని కుమారుడు సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చిందా.. ఎందుకు.. ఎందులో?