Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో రెండవ శుద్ధ డెయిరీ స్క్వేర్ ప్రారంభించిన వేకూల్

Advertiesment
తిరుపతిలో రెండవ శుద్ధ డెయిరీ స్క్వేర్ ప్రారంభించిన వేకూల్
, శుక్రవారం, 18 జూన్ 2021 (12:57 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రి-కామర్స్ కంపెనీ వేకూల్ ఫుడ్స్ కు చెందిన డెయిరీ బ్రాండ్ శుద్ద ఈ రోజున తన రెండవ డెయిరీ రిటైల్ స్టోర్, శుద్ధ స్క్వేర్‌ను తిరుపతిలో ప్రారంభించినట్టు ప్రకటించింది. జిల్లాలో ఇది మూడవ స్టోర్, ఇటీవలే తన శుద్ధ స్క్వేర్ స్టోర్‌ను చిత్తూరులో శుద్ధ ప్రారంభించింది. పాలు, పాల ఉత్పత్తులకు సంబపంధించి శుద్ధత, నాణ్యత, పోషకత, రుచులను అందించడంలో పేరెన్నికగన్న పోషకులైన శుద్ధ తమ పాలను తాజాదనం, స్వచ్ఛతలకు హామీ ఇచ్చేందుకు కఠినమైన నాణ్యతా తనిఖీ చర్యలు చేపట్టి, రోజువారీ ప్రాతిపదికన స్థానిక రైతుల నుంచి సేకరిస్తుంది. జీవకోనలో ప్రారంభించిన ఈ స్టోర్ తాజా పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, లస్సీ & కోవా లాంటి డెయిరీ ఉత్పత్తులను అందిస్తుంది.
 
శుద్ధ బ్రాండ్ “స్వచ్ఛత”కు పర్యాయపదం, ప్రతిరోజూ సేకరించే పాలు సహజమైనవిగా, సల్తీలేనివిగా నిర్ధారించుకోవడానికి కఠినమైన నాణ్యతా తనిఖీ చర్యలు తీసుకోవడం వల్ల వారి ఉత్పత్తులు తాజాదనానికీ, పరిశుభ్రతకూ, నిలకడకూ, నాణ్యమైన ఉత్పత్తులకూ పేరుపొందాయి. పొలాల నుంచే తాజా పాలను ప్రతిరోజూ స్థానిక రైతుల నుంచి శుద్ధ సేకరిస్తుంది, వాటిని చిత్తురులోని తమ ఆటోమెటెడ్, స్వర్శా రహితమైన సేకరణ, ప్రాసెసింగ్ యూనిట్‌లో శుద్ధి చేస్తాయి, వినియోగదారులు తాజాగా, కల్తీ లేని, స్వచ్ఛమైన పాలనూ, డెయిరీ ఉత్పత్తులనూ ఆస్వాదించేలా చేయడం కోసం తమ నియంత్రిత సరఫరా గొలుసుకట్టు లాజిస్టిక్స్‌ లో భాగంగా సకాలంలో శుద్ధా స్క్వేర్స్ కు అవి చేరుకుంటాయి.
 
ఈ ప్రాంతంలో పాలకు, పాల ఆధారిత ఉత్పత్తులకూ సంప్రదాయికమైన పెద్ద విపణిగా ఉన్న చిత్తూలు జిల్లాలో ప్రధాన డెయిరీ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి తిరుపతి ఎంపిక చేసుకొనే ఒక గమ్యంగా ఉంది. మొదటి శుద్ధ స్క్వేర్‌ 2021 మార్చి 15న ఏర్పాటయింది, దీనికి వినియోగదారుల నుంచి గొప్ప స్పందన లభించింది, ప్రతి రోజూ 300 లీటర్ల పైచిలుకు పాలనూ, పెరుగునూ విక్రయిస్తోంది, తన రెండో స్టోర్‌ను ప్రారంభించడానికీ, పట్టణంలో జూన్ చివరికల్లా మూడోది ప్రారంభించాలనే ప్రణాళికకూ ఇది ప్రోత్సాహాన్ని అందించింది.
 
శుద్ధా స్క్వేర్ ప్రారంభోత్సవం సందర్భంగా, దేబాశిష్ సమాల్, హెడ్ ఆఫ్ డెయిరీ, వేకూల్ ఫుడ్స్ మాట్లాడుతూ, “తిరుపతిలో మా రెండవ శుద్ధా స్క్రేర్ ప్రారంభిస్తున్నామని ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా మొదటి స్టోర్‌ ద్వారా అందుకున్న మద్దతు కూడిన స్పందన, జీవకొండలో మా ద్వారాలు తెరిచేలా మమ్మల్ని ప్రోత్సహించింది. తిరుపతిలో ఈ నెలలోనే మా మూడవ శుద్ధ స్టోర్ ఏర్పాటు చేయడానికీ, మా ఉత్పత్తుల శ్రేణిలో ఐస్ క్రీమ్, ఫ్లేవర్డ్ మిల్క్, గేదె పాలు తదితర ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మేము ఈ మధ్యే స్వీట్ కోవాను ప్రవేశపెట్టేం, పిల్లలకు చాకొలేట్ల కన్నా ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా, తమ పిల్లలకు స్థానికమైన క్యాండీని అందించడానికి మా ఉత్పత్తులు తాజాదనంతో, స్వచ్ఛతతో ఉండేవిగా పోషకులు పరిగణించడంతో వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. స్థానిక డెయిరీ రైతులకు అత్యుత్తమ జీవనోపాధి అందించడం కోసం అవకాశాలను సృష్టించడానికి కూడా మేము నిరంతరం పాటుపడుతున్నాం” అని చెప్పారు.
 
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో, తమ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, తిరుపతిలోని శుద్ధా స్క్వేర్స్ రెండూ టోకు ఆర్డర్లను ఇళ్ళకే అందించనున్నాయి. పాలు, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, పెరుగు, డబుల్ టోన్డ్ మిల్క్ పెరుగు, నెయ్యి, మజ్జిగ, లస్కీ, కోవా లాంటి వైవిధ్యమైన ఎంపికలను తమ వినియోగదారులకు శుద్ధా స్క్వేర్స్ అఫర్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు కర్నూల్‌కి నారా లోకేష్ - జగన్ సర్కారుపై బాబు ధ్వజం