Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

ఐదు నగరాలకు విస్తరించిన అల్ట్రా వయొలెట్

Advertiesment
Bike

ఐవీఆర్

, గురువారం, 19 సెప్టెంబరు 2024 (22:26 IST)
'మేకింగ్ ఇన్ ఇండియా, వరల్డ్ ఫర్ ది వరల్డ్' అనే దాని లక్ష్యంకు అనుగుణంగా, అల్ట్రా వయొలెట్ హైదరాబాదులో తమ తాజా యువి స్పేస్ స్టేషన్ ఎక్స్పీరియన్స్  కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయం అల్ట్రా వయొలెట్ విస్తరణలో ఐదవ ప్రధాన మైలురాయిని సూచిస్తుంది, ఇందులో బెంగళూరులోని ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మరియు పూణే, అహ్మదాబాద్ మరియు కొచ్చిలో ఇటీవల జరిగిన ప్రారంభాలు కూడా ఉన్నాయి. 2024 దీపావళి నాటికి 10 భారతీయ నగరాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా 50 ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలనే అల్ట్రావయొలెట్ యొక్క విశాల దృక్పథంకు అనుగుణంగా ఈ విస్తరణ సాగుతుంది.
 
'డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్' అనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా, హైదరాబాద్‌లోని కొత్త యువి  స్పేస్ స్టేషన్ అల్ట్రా వయొలెట్ అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ఎఫ్ 77 మాక్  2ను విస్తృతంగా వినియోగదారులకు  పరిచయం చేయడమే కాకుండా, కీలకమైన భారతీయ మార్కెట్లలోకి విస్తరించడంలో వ్యూహాత్మక అడుగును కూడా సూచిస్తుంది.
 
విశాలమైన 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సదుపాయం పూర్తి 3ఎస్ కేంద్రంగా పనిచేస్తుంది. అమ్మకాలు, సేవలు మరియు విడిభాగాలను ఒకే చోట అందిస్తుంది. బెంగుళూరులోని అల్ట్రా వయొలెట్ ప్రధాన కార్యాలయం నుండి అత్యాధునిక డిజిటల్ డయాగ్నస్టిక్ టూల్స్ మరియు డైరెక్ట్ ఆన్-కాల్ టెక్నికల్ సపోర్ట్‌ మద్దతు కలిగిన ఈ స్పేస్ స్టేషన్ హైదరాబాద్‌లోని ప్రియమైన వినియోగదారులకు  పూర్తిగా లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది.
 
ఎఫ్77 మాక్ 2 ఒక టాప్-టైర్ 10.3 కిలోవాట్ హావర్  ఎస్ఆర్బి7 లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది సాటిలేని పరిధి మరియు పనితీరును అందిస్తుంది. పరిశ్రమలో అత్యుత్తమమైన రీతిలో  ఆకట్టుకునే 800,000 కిమీ బ్యాటరీ వారంటీతో  ఇది ఈవీ  సెక్టార్‌లో టెస్లా కంటే మిన్నగా కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయనుంది.
 
అల్ట్రా వయొలెట్ సీఈఓ & సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ , “హైదరాబాద్‌లోని యువి  స్పేస్ స్టేషన్ ప్రారంభం,  మనం చలనశీలతను చూసే విధానాన్ని మార్చే మా లక్యం కు అనుగుణంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న టెక్ ఎకోసిస్టమ్ మరియు ఫార్వర్డ్-థింకింగ్ విధానాలతో హైదరాబాద్ ఈ మైలురాయికి అనువైన ప్రాంతంగా నిలిచింది. ఈ కొత్త స్పేస్ స్టేషన్ స్థిరమైన చలనశీలతను అభివృద్ధి చేయడానికి మరియు మోటర్‌సైకిల్‌దారులకు అసాధారణమైన అనుభవాన్ని అందించడానికి అల్ట్రావయొలెట్ యొక్క అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది. మేము తెలంగాణలో మా కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నప్పుడు, మా దృష్టి ఆవిష్కరణలను నడపడంపై మరియు మరింత తెలివైన , మరింత అనుసంధానించబడిన భవిష్యత్తు కోసం ఈ ప్రాంతం యొక్క లక్ష్యంకి మద్దతు ఇవ్వడంపైనే ఉంటుంది.." అని అన్నారు. 
 
హైదరాబాద్ సదుపాయం యొక్క ప్రారంభం పూణె, అహ్మదాబాద్ మరియు కొచ్చిలలో విజయవంతమైన ప్రారంభాలను అనుసరించింది, ఇది అల్ట్రా వయొలెట్ యొక్క వేగవంతమైన విస్తరణ వ్యూహంలో మరొక కీలక మైలురాయిని సూచిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పెట్టుబడులకు తెలంగాణ ప్రముఖ గమ్యస్థానంగా అవతరించింది, ప్రపంచ మరియు దేశీయ సంస్థల నుండి గణనీయమైన ఆసక్తిని పొందింది. తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం (ఐ&సి) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఈవీ  పరిశోధన, అభివృద్ధి, తయారీ మరియు విస్తృతమైన స్వీకరణకు కేంద్రంగా రాష్ట్ర స్థానాన్ని వెల్లడించారు. బలమైన ఈవీ  ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు వ్యాపార-స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంపై దృష్టి సారించి, తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఆవిష్కరణ మరియు వృద్ధికి మార్గం సుగమం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని