భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, ఈరోజు తన ఐకానిక్ ఏస్ శ్రేణిలో అత్యంత సరసమైన డీజిల్ వేరియంట్ అయిన ఏస్ గోల్డ్ ప్లస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం రూ. 5.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకే లభించే ఏస్ గోల్డ్+, అసాధారణమైన పనితీరును అందించడానికి రూపొందించబడింది. అదే సమయంలో తన విభాగంలో అతి తక్కువ యాజమాన్య ఖర్చు(TCO)ను కూడా అందిస్తుంది. ఇది నేటి విలువ స్పృహ కలిగిన వ్యాపారులకు ఆదర్శవంతమైన ఎంపికగా నిలిచింది.
అధునాతన లీన్ NOx ట్రాప్ (LNT) సాంకేతికతతో కూడిన ఏస్ గోల్డ్+ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (DEF) అవసరాన్ని తొలగిస్తుంది. నిర్వహణ, ఆపరేటింగ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఆవిష్కరణ కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటమే కాకుండా పునరావృత ఖర్చులను తగ్గించడం ద్వారా లాభదాయకతను పెంచుతుంది. ప్రతి ట్రిప్‌తో కొనుగోలుదారులు ఎక్కువ సంపాదించడానికి సహాయపడుతుంది.
కొత్త మోడల్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, SCVPU వైస్ ప్రెసిడెంట్-బిజినెస్ హెడ్- శ్రీ పినాకి హల్దార్ మాట్లాడుతూ, రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించినప్పటి నుండి, టాటా ఏస్ భారతదేశం అంతటా చివరి అంచె మొబిలిటీని సుస్థిరంగా మార్చింది. లక్షలాది మంది వ్యవస్థాపకులకు పురోగతిని సాధించడానికి సాధికారత కల్పించింది. ప్రతి అప్‌గ్రేడ్‌తో, ఇది అధునాతన సాంకేతికతలు, బహుముఖ విశిష్టతలు, విస్తృత వినియోగాలను పొందుపరచడానికి అభివృద్ధి చెందిం ది. ఏస్ గోల్డ్+ ప్రారంభం ఈ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేసే, లాభదాయకతను పెంచే, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి మా నిబద్ధతను బలోపేతం చేసే పరిష్కారాన్ని అందిస్తుంది అని అన్నారు.
22PS పవర్, 55Nm టార్క్ అందించే టర్బోచార్జ్డ్ Dicor ఇంజిన్ ద్వారా శక్తిని పొంది, విభిన్న వ్యాపార వినియోగాల్లో విశ్వసనీయత కోసం ఏస్ గోల్డ్+ నిర్మించబడింది. 900kg పేలోడ్ సామర్థ్యం, బహుళ లోడ్ డెక్ కాన్ఫిగరేషన్‌లతో, ఇది విస్తృత శ్రేణి కార్గో అవసరాలకు బహుముఖ ప్రజ్ఞ, సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఏస్ ప్రో, ఏస్, ఇంట్రా, యోధతో సహా టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనం, పికప్ పోర్ట్‌ఫోలియో 750 కిలోల నుండి 2 టన్నుల వరకు పేలోడ్‌లను అందిస్తుంది. వివిధ రకాల పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది.