Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పానీపూరీలు నాలుగే ఇచ్చాడని రోడ్డుపై ధర్నాకు దిగిన మహిళ (video)

Advertiesment
Panipuri

సెల్వి

, శనివారం, 20 సెప్టెంబరు 2025 (15:12 IST)
Panipuri
పానీపూరీ అంటే ఇష్టపడని భారతీయులు వుండరు. పానీపూరీలు అంటేనే చాలు సాయంత్రం ఆ షాపుల్లో లైన్లు కడుతుంటారు చాలామంది. తాజాగా పానీపూరి అమ్మేవాడు తనకు రెండు పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 
 
ఈ ఘటన గుజరాత్ వడోదరలో చోటుచేసుకుంది. తొలుత రూ.20లకు ఆరు పానీ పూరీలు ఇస్తానని.. నాలుగే ఇచ్చాడని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మిగతా రెండు పానీపూరీలు ఇచ్చే వరకు కదలనని పట్టుబట్టింది. 
 
వాహనదారులు జాగ్రత్తగా ఆమె పక్క నుంచి వాహనాలు పోనిచ్చారు. కొందరు రోడ్డు పక్కన గుంపుగా చేరి ధర్నాని చూస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BSNL Rs 199 Prepaid Recharge Plan: రూ.199 ధరకే కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌