Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

100 మాగ్నా ఈవీ ఇంటర్‌సిటీ కోచ్‌లు: గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్‌తో టాటా మోటార్స్ ఒప్పందం

Advertiesment
Tata Motors signs MoU

ఐవీఆర్

, సోమవారం, 4 ఆగస్టు 2025 (20:25 IST)
భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, యూనివర్సల్ బస్ సర్వీసెస్ (UBS) ద్వారా నెలకొల్పబడిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జీఈఎంఎస్)తో 100 అత్యాధునిక మాగ్నా EV ఇంటర్‌సిటీ కోచ్‌లను సరఫరా చేయడానికి అవగాహన ఒప్పందం(ఎంఒయూ)పై సంతకం చేసింది. చెన్నైలో ప్యాసింజర్ వెహికల్ ఎక్స్‌పో 2.0లో ఈ ఒప్పందం జరిగింది. ఇక్కడ టాటా మోటార్స్ అత్యుత్తమ పనితీరు, అసాధారణ మైన ప్రయాణీకుల సౌకర్యం, అత్యుత్తమ యాజమాన్యం కోసం రూపొందించబడిన ఆల్-ఎలక్ట్రిక్ మాగ్నా ఈవీ, ఎల్పీఓ 1822తో సహా దాని తాజా కమర్షియల్ ప్యాసింజర్ మొబిలిటీ పరిష్కారాలను ప్రదర్శిస్తోంది.
 
యూనివర్సల్ బస్ సర్వీసెస్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ ప్రీమియం ఇంటర్‌సిటీ ట్రావెల్ బ్రాండ్. తన వినూత్నత, విశ్వసనీయత, కస్టమర్-కేంద్రీకృత సేవలకు అది ప్రసిద్ధి చెందింది. అందులో కొత్తగా చేర్చబడిన ఈవీ విభాగం, గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా యూబీఎస్ సుస్థిరమైన చలనశీలతకు పరివర్తనను నడిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల గౌరవనీయ మంత్రి డాక్టర్ టి.ఆర్.బి. రాజా, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, ఆల్ ఓమ్ని బస్ ఓనర్స్ అసోసియేషన్ (AOBOA) సభ్యుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
 
తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల శాఖ గౌరవనీయ మంత్రి డాక్టర్ టి.ఆర్.బి. రాజా మాట్లాడుతూ, ‘‘ఆటోమోటివ్, క్లీన్ మొబిలిటీ ఆవిష్కరణలలో తమిళనాడు ముందంజలో ఉంది. ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి యూనివర్సల్ బస్ సర్వీసెస్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం పర్యావరణ అనుకూల, సురక్షిత ప్రజా రవాణా వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఈ చొరవ తమిళనాడు ప్రజలకు క్లీనర్ ప్రయాణ ఎంపికలను అందించడం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.  భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న, సుస్థిరమైన రవాణా పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే మా నిబద్ధతను ధృవీకరిస్తుంది’’ అని అన్నారు.
 
యూనివర్సల్ బస్ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్, గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ డైరెక్టర్ శ్రీ సునీల్ కుమార్ రవీంద్రన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తూ, ‘‘టాటా మోటార్స్‌తో మా దీర్ఘకాల అనుబంధం నమ్మకంపై నిర్మించబడింది. మాగ్నా ఈవీ కోచ్‌లతో మేము ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ ప్రయాణానికి మారుతున్నందున ఈ అవగాహన ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ బస్సులు నిశ్శబ్దమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలను, మెరుగైన ప్రయాణీకుల అనుభవాన్ని అందిస్తాయి. సుదూర మార్గాలకు సరిగ్గా సరిపోతాయి. తగ్గిన నిర్వహణ ఖర్చులు, సున్నా ఉద్గారాలతో, ఈ ఫ్లీట్ మా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా సుస్థిరమైన చలనశీలతకు మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది." అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను చాటుతూ, టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ హెడ్ శ్రీ ఆనంద్ ఎస్ మాట్లాడుతూ, ‘‘యూబీఎస్ తో ఈ అవగాహన ఒప్పందం నగరాల మధ్య రవాణాను మార్చడానికి మా ప్రయాణంలో ఒక మైలురాయి సందర్భం. విస్తృతమైన కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కఠినమైన పరీక్షల ద్వారా అభివృద్ధి చేయబడిన మా గ్నా ఈవీ, భారతదేశంలో సుదూర ప్రయాణాన్ని పునర్నిర్వచించటానికి రూపొందించబడింది. ఇది సౌకర్యం, సామర్థ్యం, సుస్థిర త్వంలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ మాస్ మొబిలిటీ సొల్యూషన్స్  ప్రముఖ ప్రొవైడర్‌గా, టాటా మోటార్స్ క్లీన్, కనెక్టెడ్ రవాణా భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
 
టాటా మాగ్నా ఈవీ కోచ్ అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ బస్సు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది సుదూర ప్రయాణ సౌకర్యం కోసం రూపొందించబడిన 44-సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. ఎర్గోనామిక్ సీట్లు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBS) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC) ద్వారా ప్రయాణీకుల సౌలభ్యం, భద్రత మెరుగుపరచబడ్డాయి. టాటా మోటార్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సు విభాగంలో అగ్రగామిగా ఉంది. ఇందులో స్టార్‌బస్ ఈవీ, అల్ట్రా ఈవీ ఇంట్రా-సిటీ ట్రావెల్ కోసం, మాగ్నా ఈవీ ఇంటర్‌సిటీ ట్రావెల్ కోసం ఉన్నాయి. 11 నగరాల్లో 3,600 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు పని చేస్తున్నాయి, ఈ బస్సులు 95% కంటే ఎక్కువ అప్‌టైమ్‌తో 34 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరాన్ని మొత్తంగా నడిపాయి. ఈ బస్సులు రియల్-టైమ్ డయాగ్నస్టిక్స్, ట్రాకింగ్, ఫ్లీట్ ఆప్టిమైజేషన్‌ను ప్రారంభించే టాటా మోటార్స్ కనెక్టెడ్ వాహన ప్లాట్‌ఫామ్ ఫ్లీట్ ఎడ్జ్‌తో అమర్చబడి ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)