Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవు, గేదె వెన్న విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

ఆవు, గేదె వెన్న విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌
, మంగళవారం, 16 నవంబరు 2021 (23:23 IST)
సహజసిద్ధమైన, కల్తీలేని ఆవు మరియు గేదె వెన్నను సాల్టెడ్‌ మరియు అన్‌ సాల్టెడ్‌ అవకాశాలలో విడుదల చేసినట్లు సిద్స్‌ ఫార్మ్‌ వెల్లడించింది. ఫార్మ్‌ టు ప్లేట్‌ కల్తీలేని వెన్నను తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణాలోని షాబాద్‌లో ఉన్న ప్లాంట్‌లో ఈ వెన్నను తయారుచేశారు. సిద్స్‌ ఫార్మ్‌ విడుదల చేసిన కల్తీలేని ఆవు, గేదె వెన్నలు 250 గ్రాముల ప్యాక్‌లో కేవలం 250 రూపాయల ధరలో లభ్యమవుతాయి.

సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ట్రెండ్స్‌ మారుతూనే ఉన్నాయి.  వినియోగదారులు ఇప్పుడు పోషక విలువలపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అదే సమయంలో కల్తీలేని ఉత్పత్తులు, అదీ సహజసిద్ధమైన వాటిని కోరుకుంటున్నారు. సిద్స్‌ ఫార్మ్‌ విడుదల చేసిన ఆవు, గేదె వెన్నలు సాల్టెడ్‌ మరియు అన్‌సాల్టెడ్‌ రకాలలోలభ్యమవుతాయి’’అని అన్నారు.

సిద్స్‌ ఫార్మ్‌ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆవు వెన్న ప్యాక్‌లు, గేదె వెన్నలా 740 కిలో కేలరీ శక్తిని, 0.6 గ్రాముల ప్రొటీన్‌ కలిగిఉండటంతో పాటుగా సహజసిద్ధమైన పోషక విలువలు కలిగి ఉంటాయి. కల్తీ జరుగనటువంటి రీతిలో జరిగే ప్రాసెసింగ్‌ తో పాటుగా ఈ రెండు రకాల వెన్నలూ విటమిన్‌ ఏ,డీ, ఈ కలిగి ఉన్నాయనే భరోసా అందిస్తాయి. రుచిపరంగా గేదె వెన్నను బేకింగ్‌ ఉత్పత్తులలో వాడితే, ఆవు వెన్నను  బ్రెడ్‌,  వంటలలో వినియోగించవచ్చు.


ఐఎంఆర్‌ఏసీ నివేదికల ప్రకారం 2021–2026 నడుమ  టేబుల్‌ బటర్‌ మార్కెట్‌ 19%  వృద్ధి చెందనుంది. ఇది 2015–20220 నడుమ ఇది గణనీయమైన వృద్ధిని సాధించింది. బటర్‌ మార్కెట్‌లో అత్యధిక వాటాను ఆసియా–ఫసిఫిక్‌ ప్రాంతం పొందింది. ఈ ప్రాంతంలో ఇండియా, అనుసరించి చైనాలు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌లుగా ఈ ప్రాంతంలో నిలుస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు: 20 రోజుల్లో రూ. 2.8 కోట్లు