Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టిన ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ

Advertiesment
SBI-Flipcart

ఐవీఆర్

, గురువారం, 28 ఆగస్టు 2025 (21:05 IST)
భారతదేశపు అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీదారు అయిన ఎస్‎బిఐ, భారతదేశపు స్వదేశీ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‎కార్ట్, ఉమ్మడిగా ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. శ్రీ. చల్లా శ్రీనివాసులు శెట్టి, చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‎బిఐ), శ్రీ. అశ్విని కుమార్ తెవారి, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్‎బిఐ సమక్షములో ఈ ఏకైక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రవేశపెట్టబడింది. బుద్ధికుశలత కలిగిన వినియోగదారులకు వారి కొనుగోళ్ళపై ఒక ఆనందాన్ని ఇచ్చే షాపింగ్ అనుభవాన్ని అందించుటకు, జాగ్రత్తగా ఎంపిక చేయబైన క్యాష్‎బ్యాక్ ప్రయోజనాలతో ఈ ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ క్రెడిట్ కార్డ్ అత్యంత శ్రద్ధగా రూపొందించబడింది.
 
ఈ ప్రారంభము కొనుగోలుదారులకు వారి షాపింగ్ ప్రయాణాన్ని మెరుగుపరుస్తూ, అధిక విలువ, అనుకూలత మరియు అధికారిక క్రెడిట్‌కు ప్రాప్యతలను అందించుటకు ఎస్‎బిఐ కార్డ్ మరియు ఫ్లిప్‎కార్ట్ యొక్క కొనసాగే ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు ఎస్‎బిఐ కార్డ్ వారి వెబ్సైట్‌ను సందర్శించి డిజిటల్ గా క్రెడిట్ కార్డ్ కోసం ఫ్లిప్‎కార్ట్ యాప్ మరియు ఎస్‎బిఐ కార్డ్ స్ప్రింట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ క్రెడిట్ కార్డ్‌తో, వినియోగదారులు మింత్ర పై ఖర్చు చేసిన దానిలో 7.5 శాతం మరియు ఫ్లిప్‎కార్ట్, షాప్సి, క్లియర్‎ట్రిప్ పై ఖర్చులపై 5 శాతం క్యాష్‎బ్యాక్ అందుకోవచ్చు. వినియోగదారులు ఫ్లిప్‎కార్ట్ ఎకోవ్యవస్థ పైన ఉన్న, మొబైల్స్, ఎలెక్ట్రానిక్స్, సరుకులు, ఫ్యాషన్, ఫర్నీచర్, ఉపకరణాలు, హోమ్ ఫర్నిషింగ్స్, ప్రయాణాల బుకింగ్స్, మరెన్నో విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేయుటకు ఈ బహుమతి విలువ ప్రతిపాదనను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు జొమాటో, ఊబర్, నెట్‎మెడ్స్, పివిఆర్ వంటి ఎంపిక చేయబడిన బ్రాండ్స్ పై 4 శాతం క్యాష్‎బ్యాక్, అన్ని ఇతర అర్హత ఉన్న ఖర్చులపై 1 శాతం అపరిమిత క్యాష్‎బ్యాక్ కూడా అందుకోవచ్చు. ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ క్రెడిట్ కార్డ్ క్యాష్‎బ్యాక్ సదుపాయము యొక్క ఆటో-క్రెడిట్ తో వస్తుంది, తద్వారా అర్హత ఉన్న క్యాష్‎బ్యాక్, ఎస్‎బిఐ కార్డ్ అకౌంట్ లోకి ఆటోమాటిక్‌గా క్రెడిట్ అవుతుంది, సమస్యా-రహితమైన అనుభవాన్ని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)