ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించేలా ఈ సేల్‌ను మంగళవారం నుంచి ప్రారంభించనుంది. మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్... ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు మాత్రం సోమవారం నుంచే అందుబాటులోకి చ్చింది. ఐఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రాడక్టులతో పాటు అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్, వీఐపీ మెంబర్స్‌కు 24 గంటల ముందే భారీ డిస్కౌంట్ డీల్స్ ఆకట్టుకున్నాయి.
కాగా, స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ రాయితీని ఇచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ 2025లో భాగంగా, భారీ తగ్గింపు ఆఫర్లపై ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. పలు రకాల స్మార్ట్‌ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, నథింగ్, విడో, రియల్ మీ, ఒప్పో వంటి ప్రముఖ బ్లాండ్ ఫోన్లపై కూడా డిస్కౌంట్ డీల్స్ దక్కించుకోవచ్చు. స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానికి, ఫ్యాషన్ ప్రాడక్ట్స్, స్పోర్ట్స్, మేకప్ వస్తువులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది.