Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రెనాల్ట్ ఇండియా R స్టోర్ ప్రారంభం

Advertiesment
Renault

ఐవీఆర్

, గురువారం, 14 ఆగస్టు 2025 (16:02 IST)
విజయవాడ: రెనాల్ట్. రీ థింక్. బ్రాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్ట్రాటజీ కింద తమ ఉత్సాహ పూరితమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ గ్రూప్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా, విజయవాడలో తమ కొత్త'R స్టోర్‌ను ప్రారంభించింది, ఇది ఆంధ్రప్రదేశ్‌లో తమ కొత్త , ఆధునిక వాణిజ్య గుర్తింపుకు నాంది పలికింది. మారుతున్న కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా, డిజైన్ ఆవిష్కరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, కస్టమర్-ఫస్ట్ సేవలను మిళితం చేయడానికి రెనాల్ట్ ఇండియా బ్రాండ్ అనుభవం, పరివర్తన వ్యూహంలో భాగంగా ఈ ప్రారంభం జరిగింది. 
 
ఈ సందర్భంగా రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ సేల్స్- మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ, మా ఉత్పత్తులకు రాష్ట్రంలో లభించిన ప్రోత్సాహకరమైన స్పందనతో ఆంధ్రప్రదేశ్ మాకు ప్రాధాన్యత గల మార్కెట్‌గా నిలిచింది. విజయవాడలో కొత్త R స్టోర్ ప్రారంభించడం అనేది రెనాల్ట్. రీథింక్. స్ట్రాటజీ కింద చేస్తోన్న మా వ్యాపార విస్తరణలో ఒక ముందడుగు, ఇది స్థానిక ఆకాంక్షలకు అనుగుణంగా రెనాల్ట్ యొక్క ప్రపంచ బ్రాండ్ విలువలను ప్రదర్శిస్తూనే అత్యుత్తమ కస్టమర్ అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది. మేము మా కార్యక్రమాలను విస్తరించడం కొనసాగిస్తున్నందున, ఆటోమోటివ్ రంగం లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని మేము భావిస్తున్నాము అని అన్నారు.
 
విజయవాడలోని కొత్త R స్టోర్ 21,720 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, మొత్తం షోరూమ్ ప్రాంతం 5,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ షో రూమ్‌లో 5 కార్లను సౌకర్యవంతంగా చేసే డిస్ప్లే, డెలివరీ బే ఉన్నాయి, ఇది కస్టమర్లకు సౌకర్యవంతమైన కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది.
 
ఈ విస్తరణతో, అత్యాధునిక స్టోర్ డిజైన్, వినూత్న లేఅవుట్‌లు, మెరుగైన కార్ల కొనుగోలు ప్రయాణం ద్వారా భారతదేశం అంతటా ప్రపంచ స్థాయి కస్టమర్ అనుభవాలను అందించే దాని నిబద్ధతను రెనాల్ట్ ఇండియా బలోపేతం చేస్తుంది. ఈ కొత్త R స్టోర్ రెనాల్ట్ యొక్క కొత్త విజువల్ ఐడెంటిటీ (NVI)ని అందించడానికి సిద్ధంగా ఉంది, ఇందులో సొగసైన ముఖభాగం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన నవీకరించబడిన లోగో ఉన్నాయి, ఇది పట్టణ కార్ డీలర్‌షిప్‌ను మరింత ఆహ్వానించదగినదిగా చేస్తోంది. పునఃరూపకల్పన చేయబడిన లేఅవుట్ కస్టమర్‌లు వాహనాన్ని అన్ని కోణాల నుండి అన్వేషించడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది, ఇది కస్టమర్‌లకు లీనమయ్యే అనుభవాన్ని, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులివెందులకు పూర్వవైభవం వచ్చింది : ఎమ్మెల్యే బాలకృష్ణ