దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించనుంది. ఈ మేరకు జర్మనీ కంపెనీ మెట్రో ఏజీకి చెందిన దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని 500 మిలియన్ యూరోలకు (రూ.4,060 కోట్లు) సొంతం చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత కొద్ది వారాల నుంచి డీల్‌పై మెట్రో ఏజీ, రిలయన్స్ రిటైల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. గత వారమే రిలయన్స్ రిటైల్ డీల్‌కు మెట్రో ఏజీ అంగీకారం తెలిపినట్టు టాక్.
మెట్రో క్యాష్ అండ్ క్యారీకి దేశవ్యాప్తంగా ఉన్న 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి.