తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని బైకుపై ఇంటికి తరలించాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది.
ఈ గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలు లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బుులు ఇచ్చే స్థోమత లేక కుమారుత శవాన్ని తండ్రి తన బైకుపైనే తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై బాధిత తండ్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ లేదని, పైగా, ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే ఆర్థిక స్తోమత తనకు లేదన్నారు. అందుకే చనిపోయిన తన కుమార్తె శవాన్ని 50 కిలోమీటర్ల దూరం బైకుపై ప్రయాణించి గ్రామానికి తీసుకొచ్చినట్టు చెప్పాడు. ఈ మార్గంలో ఓ వాగును కూడా దాటుకుని ఇంటికి చేరినట్టు బోరున విలపిస్తూ చెప్పాడు.