Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్‌ను విడుదల చేసిన ఓఆర్ఎస్ఎల్

Advertiesment
Mango

ఐవీఆర్

, మంగళవారం, 12 ఆగస్టు 2025 (21:27 IST)
భారతదేశంలో నంబర్ 1 ఎలక్ట్రోలైట్ డ్రింక్ అయిన ఓఆర్ఎస్ఎల్, ఈరోజు ఓఆర్ఎస్ఎల్ జీరోను విడుదల చేయటం ద్వారా దాని ఎలక్ట్రోలైట్, హైడ్రేషన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. దీనిలో చక్కెర జోడించబడలేదు. ఈ ఎలక్ట్రోలైట్ పానీయం అసలైన మామిడి గుజ్జుతో తయారు చేయబడింది. ఈ విడుదలతో, కెన్‌వ్యూ దాని బ్రాండ్ ఓఆర్ఎస్ఎల్‌తో భారతీయ వినియోగదారుల మారుతున్న, విభిన్న అవసరాలను తీర్చడంలో సహాయపడే సమగ్రమైన సైన్స్-ఆధారిత హైడ్రేషన్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియోను అందించడానికి దాని నిబద్ధతను బలోపేతం చేస్తుంది.
 
రోజువారీ ఆరోగ్యం కోసం రూపొందించబడిన ఓఆర్ఎస్ఎల్ జీరో మ్యాంగో ఎలక్ట్రోలైట్ డ్రింక్, రుచికరమైన, మెరుగైన  హైడ్రేషన్‌ను అందించే మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను నిజమైన మామిడి గుజ్జు, అసలు జోడించని చక్కెరతో మిళితం చేస్తుంది. ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లోని కనీస కేలరీలు సహజంగా లభించే మామిడి గుజ్జులోని చక్కెరల నుండి వస్తాయి. తమ జీవనశైలిలో భాగంగా కేలరీల పట్ల శ్రద్ధ వహించే, చక్కెర తీసుకోవడం పట్ల అమిత జాగ్రత్తగా ఉండే వ్యక్తులకు అనువైన ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్ మెరుగైన వెల్నెస్ కోసం అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి కెన్వ్యూ ఇండియా, సెల్ఫ్-కేర్ బిజినెస్ హెడ్ ప్రశాంత్ షిండే మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో, వినియోగదారులు పోషకాహార పరిష్కారాలను ఎక్కువగా కోరుకోవడం గమనించాము. ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్ మామిడి యొక్క రుచులతో చక్కెర జోడించని రీతిలో రీహైడ్రేషన్‌ను అందించడంలో సహాయపడుతుంది అని  అన్నారు. కెన్వ్యూ సీనియర్ ఆర్అండ్‌డి డైరెక్టర్ నాగరాజన్ రామసుబ్రమణ్యం మాట్లాడుతూ, ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్ మ్యాంగో అనేది ఎలక్ట్రోలైట్‌ల మిశ్రమంతో రీహైడ్రేషన్‌కు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయంగా రూపొందించబడింది, అయితే దాని జీరో యాడెడ్ షుగర్ కేలరీల వినియోగం గురించి ఆప్రమప్తత ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫార్మా కోల్డ్ సప్లై చైన్‌లోకి ప్రవేశించిన సెల్సియస్ లాజిస్టిక్స్