అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైనా టెస్లా కంపెనీ భారత్‌లో తన షోరూమ్‌ను తెరిచింది. దేశ రాజధాని ఢిల్లీలో తన రెండో షోరూమ్‌ను తెలిసింది. దాదాపు 8,200 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
అలాగే, సాకేత్, నోయిడా, ఆరిజన్ తదితర ప్రాంతాల్లో ఈ సూపర్ చార్జర్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ముంబైలో తొలి షోరూమ్‌ను ఓపెన్ చేసిన టెస్లా.. కొన్ని రోజుల క్రితమే మొదటి సూపర్ ఛార్జర్ స్టేషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్, పూణె, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జయపుర వంటి 8 నగరాల్లోనూ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.
వీ4 సూపర్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేయడానికి కిలోవాట్‌కు రూ.24 వసూలు చేస్తారు. 11 కిలోవాట్అవర్ స్పీడ్ ఉన్న ఏసీ ఛార్జింగ్‌కు కిలోవాట్ ధర రూ.11గా నిర్ణయించారు. ఈ వీ4 సూపర్ ఛార్జర్ ద్వారా కొత్తగా లాంచ్ చేసిన టెస్లా మోడల్‌పై కారును కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్ చేసి 267 కి.మీ. ప్రయాణించొచ్చు.
దేశీయ మార్కెట్లో దీనిని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, లాంగ్ రేంజ్ మోడల్ ధర రూ.67.89 లక్షలుగా కంపెనీ తెలిపింది. ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 500-600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని తెలిపింది.