Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Advertiesment
gst collections

ఠాగూర్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (17:39 IST)
గడిచిన జూలై నెలలో రికార్డు స్థాయిలో గూడ్స్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత యేడాది జూలై నెలాఖరుతో పోల్చితే 2025 జూలై నెలలో ఈ పన్న వసూళ్లలో 7.5 శాతం వృద్ధిరేటు సాధించింది. ఈ మేరకు జూలై నెలకు సంబంధించిన జీఎస్టీ గణాంకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. 
 
గతేడాది జులైలో జీఎస్టీ రూపంలో రూ.1.82 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా రూ.1.8 లక్షల కోట్లుపైగానే స్థిరంగా నమోదవుతూ వస్తున్నాయి. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూళ్లు సాధించగా.. జూన్‌లో రూ.1.85 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు