Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫార్మా కోల్డ్ సప్లై చైన్‌లోకి ప్రవేశించిన సెల్సియస్ లాజిస్టిక్స్

Advertiesment
Swaroop bose

ఐవీఆర్

, మంగళవారం, 12 ఆగస్టు 2025 (21:04 IST)
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక-ఆధారిత 3పీఎల్, కోల్డ్ సప్లై చైన్ పరిష్కారాల ప్రదాత అయిన సెల్సియస్ లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్ సరఫరా చైన్‌కు సంబంధించిన కార్యకలాపాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అంకితమైన ప్రత్యేక లాజిస్టిక్స్ విభాగం సెల్సియస్+ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఉష్ణోగ్రత నియంత్రణ, ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ, వాస్తవ సమయ పర్యవేక్షణ వంటి ఈ రంగం యొక్క కఠినమైన అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన సెల్సియస్+, మందులు, వ్యాక్సిన్‌లు, ఇతర సున్నితమైన ఉత్పత్తులను గరిష్ట భద్రత, సామర్థ్యంతో రవాణా చేయడాన్ని నిర్ధారిస్తుంది.
 
తొలి దశలో సెల్సియస్ రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రత్యేకమైన ఫార్మా ఫ్లీట్‌ను రూపొందించి, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తుంది. రాబోయే 18 నెలల్లో ఈ విభాగం నుండి రూ. 100 కోట్ల వార్షిక పునరావృత ఆదాయం(ఏఆర్ఆర్) సాధించాలనే లక్ష్యంతో ఉంటుంది. ఇందులో రూ.35 కోట్లు భారతదేశం అంతటా కీలకమైన ఫార్మాస్యూటికల్ కారిడార్‌లలో సెల్సియస్+ కోసం 100 కొత్త రీఫర్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావటానికి కేటాయించబడతాయి. అధిక డిమాండ్ ఉన్న పట్టణ, సెమీ-అర్బన్ మార్కెట్లకు సేవలందించడానికి రూపొందించబడిన బలమైన ఫార్మా కొరియర్ వ్యవస్థను నిర్మించడానికి మరో రూ. 10-15 కోట్లు కేటాయించబడుతున్నాయి.
 
ఈ వేగవంతమైన విస్తరణకు మద్దతుగా, ఫార్మా లాజిస్టిక్స్, నిర్వహణ, నియంత్రణ ప్రమాణాలలో నైపుణ్యం కలిగిన 30-40 మంది ప్రత్యేక బృంద సభ్యులను సెల్సియస్ జోడించనుంది. దాని అధునాతన సాంకేతిక వేదికపై ఆధారపడి, సెల్సియస్+ రియల్-టైమ్ ట్రాకింగ్, నిరంతర ఉష్ణోగ్రత పర్యవేక్షణ, ఏఐ-ఆధారిత రూట్ ఆప్టిమైజేషన్‌ను అందిస్తుంది, ప్రతి షిప్‌మెంట్ పరిశ్రమ యొక్క అత్యంత కఠినమైన నాణ్యత, నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకుంటుంది.
 
ఈ ప్రారంభం గురించి సెల్సియస్ లాజిస్టిక్స్ వ్యవస్థాపకుడు- సీఈఓ స్వరూప్ బోస్ మాట్లాడుతూ, భారతదేశ ఫార్మాస్యూటికల్ రంగం,  ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి, అయినప్పటికీ తయారీదారు నుండి రోగి వరకు ఉత్పత్తి సమగ్రతను నిర్వహించడం ఒక సవాలుగానే నిలుస్తోంది. సెల్సియస్+తో, మేము సామర్థ్యాన్ని విస్తరించడమే కాకుండా, ఫార్మా లాజిస్టిక్స్‌లో వృధా తగ్గింపు, భద్రత, పారదర్శకత , కార్యాచరణ శ్రేష్ఠతకు కొత్త ప్రమాణాలను కూడా నిర్దేశిస్తున్నాము.
 
ఈ విభాగంలో మా పెట్టుబడి టెక్-ఆధారిత, జిడిపి -నియంత్రణ ప్రమాణాలతో కూడిన పరిష్కారాలతో ఫార్మా పంపిణీలో అంతరాలను తగ్గించడానికి దృష్టి సారించిన ప్రయాణం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమం కోల్డ్ చైన్ అంతరాలను తగ్గించడం, వృధాను తగ్గించడం , ప్రాణాలను రక్షించే ఉత్పత్తుల కోసం సురక్షితమైన, సకాలంలో డెలివరీలను ప్రారంభించడం అనే సెల్సియస్ లాజిస్టిక్స్ లక్ష్యంకు అనుగుణంగా ఉంది. సంవత్సరాంతానికి ప్రధాన నగరాల్లో సురక్షితంగా , సమర్ధవంతంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ పరిధిని విస్తరించడంలో సెల్సియస్+ సహాయపడగలదని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు. 
 
ఈ ప్రత్యేక విభాగంతో, ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని, 2025 చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా 100కి పైగా నగరాలలో తమ కార్యకలాపాలను విస్తరించాలని సెల్సియస్ యోచిస్తోంది. ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ రంగాలలోని సంస్థల కోసం రూపొందించిన సాంకేతిక ఆధారిత సరఫరా చైన్ పరిష్కారాలను సెల్సియస్+ అందిస్తుంది, ఉష్ణోగ్రత-నియంత్రిత లాజిస్టిక్స్, నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంతో పాటుగా వాస్తవ సమయంలో  షిప్‌మెంట్ విజిబిలిటీ వంటి క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తుంది. ఈ విభాగం టీకాలు, బయోలాజిక్స్, ఇన్సులిన్, స్పెషాలిటీ మెడిసిన్‌లతో సహా అధిక-విలువ, సున్నితమైన విభాగాలపై దృష్టి సారిస్తుంది, ప్రాథమిక పంపిణీ, ద్వితీయ పంపిణీ, చివరి మైలు ఫార్మా కొరియర్ డెలివరీ వరకు తమ సేవలను అందించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)