దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫిబ్రవరి-మార్చి నెలల్లో మూతపడనుంది. రన్ వే మరమ్మత్తుల కారణంగా విమానాశ్రయాన్ని రెండు నెలల పాటు మూతవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదుగంట వరకు తాత్కాలికంగా ముంబై ఎయిర్‌పోర్ట్ మూతపడనుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తద్వారా 230 రోజూ నడిచే విమానాల సేవలు రద్దైనాయి. రోజుకు ఆరు గంటల పాటు ముంబై విమానాశ్రయం మూతపడటం ద్వారా విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మరమ్మత్తు పనులు జరుగుతాయని.. ముంబై విమానాశ్రయంలోని రెండు రన్‌వేలపై రోజుకు 85 ఫ్లైట్స్ నడుస్తాయి.
అదీ గంటలోనే ఈ రన్‌వేలపై 85 విమానాల రాకపోకలు నడుస్తుంటాయి. ముంబై నుంచి ఢిల్లీ, గోవా, బెంగళూరుకు నడిచే విమాన సేవలు కూడా రద్దైనట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. మెడికల్ విమాన రాకపోకలు మాత్రం జరుగుతాయి.