Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుకింగ్స్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన లెక్సస్ ఇండియా

Advertiesment
Lexus India Reopening of LM 350h Bookings

ఐవీఆర్

, బుధవారం, 7 మే 2025 (22:13 IST)
Lexus India Reopening of LM 350h Bookings
బెంగళూరు: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మంచి నమ్మకమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది లెక్సస్ ఇండియా. అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే ప్రీమియం మోడల్స్ తో ఉండే లెక్సస్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే లెక్సస్‌లో చాలా పాపులర్ మోడల్ LM 350h. ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. లెక్సస్ ఇండియా యొక్క LM 350h మోడల్.. ప్రారంభమైన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల ఔత్సాహికులను ఆకర్షించింది. ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన ఈ అద్భుతమైన మోడల్ అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ విభాగాన్ని సరికొత్తగా పునర్నిర్వచించింది.
 
లెక్సస్ ఇండియా కార్లలో ఎంతో ఇంపార్టెంట్ అయిన LM 350h వెహికల్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అఖండ స్పందనను పొందింది. ఇది అల్ట్రా-లగ్జరీ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా అసాధారణమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే దాని విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌‌ను నిర్దేశిస్తుంది. ప్రశాంతమైన ప్రయాణ వాతావరణాన్ని అందించడానికి రూపొందించబడిన ఈ వెహికల్ అధునాతన హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉంది. దాదాపు నిశ్శబ్దమైన రైడ్, ఖచ్చితమైన నిర్వహణ, ప్రశాంతమైన ప్రయాణం కోసం అత్యుత్తమ వెనుక సీటు సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది. నాలుగు-సీట్ల మరియు ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్న ఈ వాహనం.. అద్భుతమైన లగ్జరీని, ప్రశాంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని సూచిస్తుంది.
 
ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేచి గారు మాట్లాడుతూ, “లెక్సస్ LM 350Hపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మా అతిథులకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. లెక్సస్ ఇండియాలో, మా అతిథుల ఆకాంక్షలు, సాంప్రదాయానికి మించిన అనుభవాల అందించేలా మేము అన్నివేళలా మేము ముందుకు సాగుతున్నాము. LM 350h బుకింగ్‌లను తిరిగి తెరవడం కేవలం డిమాండ్‌కు ప్రతిస్పందన మాత్రమే కాదు, సాటిలేని లగ్జరీ, ఆవిష్కరణ, శ్రేష్ఠతను అందించాలనే మా వాగ్దానాన్ని పునరుద్ఘాటించడం. గంభీరమైన LM 350h యొక్క ప్రత్యేక చక్కదనాన్ని అనుభవించడానికి మా అతిథులను తిరిగి స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాము.” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు