Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో ‘మేక్స్ లగ్జరీ పర్సనల్’ నినాదాన్ని ప్రతిబింబించిన లెక్సస్ ఇండియా

Advertiesment
Lexus cars

ఐవీఆర్

, మంగళవారం, 21 జనవరి 2025 (18:48 IST)
రాబోయే రోజుల్లో తమ సంస్థ నుంచి రాబోతన్న అద్భుతమైన ఉత్పత్తులను, వాటి ప్రత్యేకతలను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లెక్సస్ ఇండియా ఆవిష్కరించి అందర్నీ ఆకట్టుకుంది. ఇవి ప్రత్యేకంగా లగ్జరీని సరికొత్తగా పునర్నిర్వచించాయి. లెక్సస్ ఇండియా లగ్జరీ కార్లని సొంతం చేసుకున్న వారికి అసమానమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. స్థిరమైన మొబలిటీని అందిస్తూనే సరికొత్త అనుభవాన్ని అందిస్తాయి. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు, స్పెషల్ ఫీచర్స్ కలిగిన ఈ లగ్జరీ కార్లు... ఎక్స్‌ పో లో 'మేకింగ్ లగ్జరీ పర్సనల్' అనే నినాదాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాయి.
 
రాబోయే రోజుల్లో ఎలక్ట్రిఫికేషన్, సస్టైనబులిటీతో కూడిన మొబలిటీకి లెక్సస్ ఇండియా కట్టుబడి ఉంది. అందుకోసమే భవిష్యత్తును తిరిగి ఊహించుకోవడానికి అంకితం చేయబడింది. అదే సమయంలో ప్రామాణికమైన, శుద్ధి చేయబడిన, ఓమోటేనాషి, ఎంగేజింగ్, ఊహాత్మకమైన విలువలను బలోపేతం చేస్తుంది. మల్టీ పాత్ వే అప్రోచ్‌తో సిద్ధమైన హాల్ 5 వద్ద ఉన్న పెవిలియన్, ఫ్యూచర్ జోన్, లైఫ్ స్టైల్ జోన్, హైబ్రిడ్ జోన్ అనే మూడు విభిన్న జోన్లను కలిగి ఉంది, సందర్శకులకు లగ్జరీతో కూడిన స్టైల్, ఆకర్షణీయమైనభవిష్యత్తును అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది.
 
ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ హికారు ఇకేయుచి మాట్లాడుతూ, "భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 అనేది లెక్సస్ యొక్క మల్టీ-పాత్ అప్రోచ్ విధానాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదిక. ఇక్కడ మనం ప్రదర్శించే ప్రతీది లోతైన గౌరవం, శ్రద్ధను ప్రతిబింబించే ఓమోటేనాషి పట్ల మా నిబద్ధతను ఆవిష్కరిస్తుంది. అసాధారణ అనుభవాలు, తదుపరి తరం డిజైన్ మరియు ఊహాత్మక సాంకేతికతలను అతిథులకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. అదే సమయంలో లెక్సస్ భవిష్యత్తు కోసం మా ప్రయత్నాలను కూడా చాటిచెప్పాము. స్థిరత్వం, ప్రామాణికమైన లగ్జరీ కోసం మా ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందిస్తూ మరింతగా ముందుకు వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాము, రాబోయే రోజుల్లో అందరి అంచనాలను ఆత్మీయంగా అందుకుంటాము." అని అన్నారు.
 
ఈ కార్యక్రమం గురించి లెక్సస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయ శ్రీ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ, "భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లెక్సస్ ఇండియా తన ఉత్తేజకరమైన శ్రేణిని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. అధునాతన సాంకేతికతలతో అందర్నీ ఆకర్షించే శ్రేణితో కూడిన లెక్సస్ పెవిలియన్‌కు అతిథులను స్వాగతించడానికి మేము సంతోషిస్తున్నాము, ఇది భవిష్యత్తులో అవకాశాల వైపు మమ్మల్ని నడిపిస్తుంది. అదనంగా, లెక్సస్ ఇండియా కూడా 2024లో 22% వృద్ధితో తన ఉత్తమ సంవత్సరాన్ని జరుపుకుంటుంది. గతేడాది మా అతిథులు, డీలర్ భాగస్వాముల మద్దతు, సహకారానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్