Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025, లగ్జరీ మొబిలిటీని చాటిచెప్పనున్న లెక్సస్ ఇండియా

Advertiesment
Lexus

ఐవీఆర్

, సోమవారం, 23 డిశెంబరు 2024 (22:57 IST)
భారతదేశంలో ప్రీమియం కార్లు అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది లెక్సస్ బ్రాండ్. ఇప్పటికే దేశంలో ప్రీమియం కార్ల వినియోగదారులకు దగ్గరైన లెక్సస్ ఇండియా... తాజాగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ ఎక్స్ పోలో రాబోయే రోజుల్లో లెక్సస్ ఇండియా నుంచి రాబోతున్న మొబిలిటీలను ప్రదర్శించబోతోంది. "మేకింగ్ లగ్జరీ పర్సనల్" అనే విజన్‌తో మరింతగా మార్పు చేసిన లగ్జరీ మరియు స్థిరమైన మొబలిటీని అందిస్తూ.. హాజరుకానున్న అతిధులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతోంది లెక్సస్ ఇండియా.
 
లెక్సస్ ఇండియా తనకున్న మల్టీ-పాత్‌వే విధానంతో సరికొత్తగా అనుసంధానించడం ద్వారా ఈ ఎక్స్ పో స్టాల్ మూడు విభిన్న జోన్లను కలిగి ఉంటుంది. మొదటిది హైబ్రిడ్‌జోన్. ఇందులో లెక్సస్ యొక్క అధునాతన గ్రీన్ టెక్నాలజీ, ఆధునిక ప్రయాణానికి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అందజేస్తుంది. ఇక రెండోది లైఫ్ స్టైల్ జోన్. ఓవర్‌ ట్రైల్ ప్రాజెక్ట్ ద్వారా అన్వేషణ, అధునాతన స్ఫూర్తి, సాహసోపేతమైన అనుభవాలు, బహిరంగ విలాసాలను కోరుకునే వారు ఈ సెగ్మెంట్ కిందకు వస్తారు. ఇక మూడోది ఫ్యూచర్ జోన్. ఇందులో అసమానమైన నైపుణ్యం, ఆలోచనాత్మకమైన డిజైన్, అత్యాధునిక ఆవిష్కరణలు, సరికొత్త మొబిలిటీ కోసం కొత్త అవకాశాలను అందించడంలో లెక్సస్ తన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాబోయే రోజుల్లో బ్రాండ్ నుంచి రాబోతున్న వాహనాలపై ఒక అద్భుతమైన సంగ్రహావలోకనం అందిస్తుంది.
 
లెక్సస్ బ్రాండ్ ప్రారంభం నుంచే... ఆటోమోటివ్ పరిశ్రమలో సరిహద్దులను చెరిపేసింది. బ్రాండ్ యొక్క మల్టీ-పాత్‌వే విధానం అధునాతన సాంకేతికతను అధునాతన లగ్జరీతో కలిపి పరిష్కారాలను అందించింది. తద్వారా విభిన్నమైన మొబిలిటీ అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సుస్థిర భవిష్యత్తుకు సహకరిస్తూనే అతిథులు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మోడల్‌లను ఎంచుకోవచ్చని ఈ విధానం నిర్ధారిస్తుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో, లెక్సస్ పర్యావరణ స్పృహ మరియు విలాసవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని సృష్టించేందుకు తన నిబద్ధతను నొక్కి చెబుతుంది.
 
ఈ సందర్భంగా ఎక్స్ పో ఈవెంట్ పై లెక్సస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తన్మయ్ భట్టాచార్య గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "సుస్థిరతకు మల్టీ పాత్ విధానం ద్వారా మొబిలిటీ యొక్క భవిష్యత్తును పునర్నిర్మించడానికి లెక్సస్ అంకితమైంది. అదే సమయంలో ప్రామాణికమైన, శుద్ధి చేయబడిన, ఒమోటేనాషి అనే దాని ప్రధాన విలువలను బలోపేతం చేస్తుంది. ఈ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో, 'ఒమోటేనాషి' యొక్క లెక్సస్ ఫిలాసఫీకి కట్టుబడి ఉంటుంది. అదే సమయంలో మా కస్టమర్‌ల ఎంపికలకు అనుగుణంగా ఆలోచించదగిన డిజైన్, శుద్ధి చేసిన లగ్జరీ, ఆవిష్కరణలు మరియు జీవనశైలి అంశాలను ప్రతిబింబించే మా ఉత్పత్తులను ప్రదర్శించడం మాకు గర్వకారణం కాబోతుంది. మా అతిథులకు వారి అభివృద్ధి చెందుతున్న జీవనశైలితో ప్రతిధ్వనించే ప్రామాణికమైన అనుభవాలను అందించడం, తద్వారా శాశ్వతమైన ముద్రను వారి మనసుల్లో వేయబోతున్నాం. దీనిద్వారా రాబోయే రోజుల్లో విలువైన సంబంధాలను పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది అని అన్నారు ఆయన. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు