దిగ్గజ భారతీయ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ అండ్ కంట్రోల్ భాగస్వామ్యంతో తమ వినూత్నమైన సీఎస్ఆర్ కార్యక్రమం “స్టార్ ఆరోగ్య డిజి సేవ”ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఆరోగ్య సేవలు, అంతగా లేదా అస్సలు అందని మారుమూల ప్రాంతాల్లోనూ కీలకమైన వైద్య సర్వీసులను అందుబాటులోకి తెచ్చే దిశగా టెలీమెడిసిన్, మొబైల్ హెల్త్ యూనిట్ల సామర్థ్యాలను మేళవించడం ద్వారా గ్రామీణ కమ్యూనిటీల్లో ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన అంతరాలను భర్తీ చేయాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం. ముందుగా ఆంధ్ర్రదేశ్‌లోని నాలుగు యాస్పిరేషనల్ జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలోని 44 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. మధుమేహం మరియు హైపర్‌టెన్షన్ వంటి వ్యాప్తి చెందని వ్యాధులకు సంబంధించి ప్రివెంటివ్ హెల్త్‌కేర్ మరియు నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
“సామాజిక బాధ్యత, కమ్యూనిటీలపై సుస్థిర సానుకూల ప్రభావం చూపడంపై మాకు గల నిబద్ధతకు స్టార్ ఆరోగ్య డిజి సేవ నిదర్శనం. ప్రాంతాలు లేదా సామాజిక-ఆర్థిక హోదాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందాలని మేము విశ్వసిస్తాం. టెక్నాలజీకి మొబైల్‌ను జోడించి క్షేత్ర స్థాయిలో సేవలు అందించడం ద్వారా అంతగా సేవలు అందని కమ్యూనిటీలకు సాధికారత కల్పించే, వ్యాధుల నివారణ విధానాలను ప్రోత్సహించే, ప్రజా సంక్షేమాన్ని మెరుగుపర్చే ఆరోగ్య సంరక్షణ మోడల్‌ను మేము తీర్చిదిద్దుతున్నాం. ‘అందరికీ బీమా’ అనే ఐఆర్‌డీఏఐ లక్ష్యానికి అనుగుణంగా ప్రివెంటివ్ హెల్త్‌కేర్ విషయంలో మాకున్ననిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది” అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈవీపీ & హెడ్ (కార్పొరేట్ బ్రాండ్, కమ్యూనికేషన్స్ & సస్టెయినబిలిటీ) డింపుల్ రాయ్‌సురానా కపూర్ ఈ ప్రాజెక్టు గురించి వివరించారు.
“స్టార్ ఆరోగ్య డిజి సేవ” కార్యక్రమం కింద టెక్నాలజీ తోడ్పాటుతో ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తేవడంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానంగా దృష్టి పెడుతోంది. కన్సల్టేషన్లు, సలహాలు, వైద్యపరీక్ష సేవలు, ఫాలో-అప్‌ల కోసం అర్హత కలిగిన హెల్త్‌కేర్ నిపుణుల సేవలు పొందేందుకు ఈ ఉచిత టెలీమెడిసిన్ సర్వీసు ఉపయోగపడుతుంది. అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మధుమేహం, హైపర్‌టెన్షన్ నిర్వహణ మరియు ఐరన్ పోషణపై అవగాహనను పెంపొందించేందుకు కూడా ఈ పథకం దోహదపడుతుంది. మారుమూల ప్రాంతాల్లో, అంతగా సేవలు అందని ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా సకాలంలో, కీలకమైన వైద్య సదుపాయం అందేలా చూసేందుకు మొబైల్ హెల్త్ యూనిట్లు తోడ్పడతాయి.