హైదరాబాద్: ఏమిటి మీరు రోజూ ప్రయాణం చేస్తూ ఉంటారా? దీనికి జవాబు అవును గనుక అయితే ఈ పొడుస్తున్న- మండుతున్న వేసవిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కువ సమయం నిలిచి ఉండి మీరు ఇబ్బంది పాలు అవుతూ ఉండవచ్చు. రోజూ మండే వేసవిని మీరు భరిస్తున్నారు కానీ దీనితో పాటు వేడి అలసట, చెమట, శరీర దుర్గంధం, చెమటకాయల వలన ఏర్పడే దురదల వంటి వేసవిలో ఏర్పడే ఇతర సమస్యలను కూడా ఎదుర్కొన వలసి వస్తుంది.
డెర్మీకూల్, ఇమామి లిమిటెడ్ హౌస్ నుండి భారత్ యొక్క ప్రాముఖ్యత పొందిన ప్రిక్లీ హీట్ పౌడర్ చెమటకాయల కోసం డెర్మొటాలజిస్ట్ ద్వారా ఆమోదించబడిన ఒక పరిష్కారం. ఇది “వేప”, “తులసి యొక్క డబుల్ పవర్ కలిగి ఉంది. ఈ సంవత్సరం వేసవి కోసం ఈ బ్రాండ్ హైదరాబాద్లో ఆలోచనాత్మక చొరవ మొదలు పెట్టింది. ఈ చొరవ కారణంగా నగరంలోని ప్రముఖ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తాత్కాలిక షేడ్స్ నిర్మించబడినాయి. దీనివలన పాదచారులు అనగా కొనుగోలు చేయువారు, ఆఫీసులకు వెళ్లువారు, విద్యార్థులు, సైకిళ్ళు, టూ-వీలర్, కారు నడిపే వారికి వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ షేడ్స్ కేవలం ఒక నెల రోజులకు మాత్రమే నిర్మించబడినాయి, కానీ భయంకరంగా "నిప్పులు చెరుగుతున్న వేడి" నుంచి తక్కువ సమయానికైనా హాయినందించే ఉపశమనం పొందగలరు. షేడ్స్ ప్రత్యక్ష సూర్య కిరణాల నుండి కాంతిని తగ్గించడం ద్వారా డ్రైవర్లకు దృశ్యమానుతను మెరుగుపరచడంలో సహాయపడుతాయి, సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణానికి సంభావ్యంగా తోడ్పడుతుంది
ఈ చొరవ ననుసరించి హైదరాబాద్ యొక్క పర్వత్ నగర్, మాధాపూర్ లోని రెండు స్థానాల్లో డెర్మీకూల్ ఓవర్ హెడ్ ట్రాఫిక్ సిగ్నల్ షేడ్స్ నిర్మించ బడినాయి. ఈ వేసవి కాలంలో భారత్ లోని అనేక రాష్ట్రాలలో 40 స్థానాల్లో అనేక దశలలో ఈ చొరవ మొదలు పెట్టబడింది. వేసవి ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 35 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు.
ఈ సదుపాయంతో పాటు వేసవి కాలంలో వేడి వలన కలిగే ఇబ్బందులు, చర్మం సమస్యల నుంచి వెనువెంటనే ఉపశమనాన్ని అందివ్వడానికి బ్రాండ్ ద్వారా రోడ్డు మీద వచ్చే పోయే జనానికి డర్మీకూల్ కూలింగ్ ప్రిక్లీ హీట్ టాల్క్ యొక్క స్యాంపుల్ ఇవ్వబడుతోంది. గత సంవత్సరం భరించలేని ఉష్ణోగ్రత కారణంగా కోల్కతా(పశ్చిమ బెంగాల్), కాన్పూర్ (ఉత్తర్ ప్రదేశ్) యొక్క కొన్ని ముఖ్యమైన స్థానాలలో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టబడింది. ఈ సదుపాయం జనుల నుండి మెప్పుదల పొందింది. దీనితో పాటు మండుతున్న ఈ వేసవి కాలంలో చల్లదనం నిండిన ఉపశమనం అందివ్వడానికి బ్రాండ్ యొక్క నిబద్ధతను చాటి చెబుతుంది.
వేసవి కాలంలో గత సంవత్సరంతో పోలిస్తే, ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. అందువలన డెర్మీ కూల్ ద్వారా దేశవ్యాప్తంగా 35 స్థానాలలో సమ్మర్ ట్రాఫిక్ షేడ్స్ ఏర్పాటు చేస్తూ ఈ సదుపాయం విస్తరింప బడుతోంది. దీనివలన సమాజ కళ్యాణాన్ని కోరుకుంటూ ఈ బ్రాండ్ నిప్పులు చెరుగుతున్న వేడికి చల్లదనం నిండిన ఉపశమనం అందచేసే నిబద్ధతను అందరికీ మరొక్కసారి తెలియపరచ బడుతుంది.