Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క చార్జ్‌తో 125 కి.మీ. అత్యుత్తమ శ్రేణితో జింగ్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన కైనటిక్ గ్రీన్

Zing
, ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (21:28 IST)
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారతదేశ అగ్రగామి తయారీ సంస్థ అయిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ నేడిక్కడ ఎలక్ట్రిక్ టూ వీలర్ జింగ్ హై స్పీడ్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. Zing HSS అనేది ఆధునిక, నూతన తరం రైడర్ నుంచి పొందిన స్ఫూర్తితో కూడిన జీవనశైలిని చాటిచెబుతుంది. ఈ స్కూటర్ మల్టీ స్పీడ్ మోడ్, పార్ట్ ఫెయిల్యూర్ ఇండికేటర్ వంటి అధునాతన ఫీచర్లను కలిగిఉంది. ఒక్క చార్జితో 125కి.మీ. దూరం వెళ్తుంది. దీని గొప్ప స్టైల్, సాంకేతికత, రైడింగ్ అనుభూతి లాంటివన్నీ కూడా కొనుగోలుదారులకు చెప్పలేని అనుభూతులను అందిస్తాయి. గంటకు 60 కి.మీ. టాప్ స్పీడ్‌తో ఈ వాహనం ఎంతో బాగా పరీక్షించబడింది. కొనుగోలుదారుల సురక్షితకు ఇది హామీ ఇస్తుంది. దీని అధునాతన బ్యాటరీలు, 3- స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, రీ-జనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివన్నీ మృదువైన ప్రయాణాలకు వీలు కల్పిస్తాయి.

 
Zing HSS అనేది 3.4 KwH అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీని కలిగిఉంటుంది. ఇది ఒక్కో చార్జ్‌తో 125 కి.మీ. ప్రయాణాన్ని అందించడం ద్వారా ఈ స్కూటర్‌ను ఎంతో సౌకర్యవంతమైందిగా, రేంజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనిదిగా చేస్తుంది. కైనెటిక్ విశ్వాసం, వారంటీతో Zing HSS వస్తోంది. కొనుగోలుదారులకు తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ అత్యంత వ్యయ ప్రభావపూరితమైందిగా చేసేందుకు శ్రీరామ్ సిటీ యూనియన్, ఐడీఎఫ్-సి ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ ఫైనాన్షి యల్ సర్వీసెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి భాగస్వాములతో కలసి అత్యంత ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లను సైతం కైనెటిక్ గ్రీన్ అందిస్తోంది. ఫేమ్ సబ్సిడీతో కలిపి రూ.85,000 ఆకర్షణీయ ధర (ఎక్స్- షోరూమ్) వద్ద Zing HSS కొనుగోలుదారులకు లభిస్తుంది.

 
ఈ సందర్భంగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకులు, సీఈఓ సులజ్జా ఫిరోదియా మాట్లాడుతూ, ‘‘ప్రపంచస్థాయి ఈవీ సాంకేతికతను అందించాలనే మా కట్టుబాటుకు నిదర్శనం జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ. ఈ తరగతిలోనే అత్యుత్తమంగా 125 కి.మీ. శ్రేణిలో, ఎన్నో ఫీచర్లతో ఈ మోడల్ ను ఆవిష్కరించడం మాకెంతో గర్వకారణం. హై స్పీడ్ స్కూటర్లలో పలు ఉత్పాదనలతో పోర్ట్ ఫోలియోను విస్తరించుకునే యోచనలో కంపెనీ ఉంది. విప్లవాత్మక ఇ-లూనాతో 2022 -23లో రానుంది. కైనెటిక్ లూనా, కైనెటిక్ హోండా స్కూటర్ వంటి అధునాతన వాహనాలను అందుబాటు ధరలకే అందించడం ద్వారా టూ వీలర్ విభాగంలో కైనెటిక్ గ్రూప్ ఎంతో అనుభవాన్ని కలిగిఉంది. రాబోయే ఏళ్లలో ప్రజలకు మరెంతో ఆనందాన్ని అందించేందుకు కైనెటిక్ గ్రీన్ కట్టుబడి ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగాన్ని విప్లవీక రించేందుకు ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది’’ అని అన్నారు.

 
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లో సాధించిన విజయం తరువాత  2021లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. 2021లో కంపెనీ 2 మోడల్స్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ 30,000కు పైగా స్కూటర్లను విక్రయించింది. గణేశ్ చతుర్థి, ఓనంలతో పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31 నుంచి భారతదేశంలో 300కు పైగా ఎక్స్ క్లూజివ్ కైనెటిక్ గ్రీన్ డీలర్ల వద్ద జింగ్ హై స్పీడ్ స్కూటర్ లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో తొలిసారిగా స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన లీడ్‌