నేరేడు పండ్లు వచ్చేసాయి. ఈ నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది.
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.
కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇక నేరేడు పండు మంచి మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.