Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైల్స్ పెట్టే ఇబ్బంది నుంచి దూరం కావాలంటే?

Advertiesment
best treatment of piles at home
, శుక్రవారం, 10 జూన్ 2022 (21:11 IST)
పైల్స్.. మొలలు ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. పైల్స్ వున్నవారు ప్రత్యేకించి ఈ క్రింది పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది. ఐనా అశ్రద్ధ చేసి వాటిని తింటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. కూర్చోలేరు, నిలబడలేరు, ఆ పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఈ క్రింది పదార్థాలను పక్కన పెట్టేయాలి.
 
1. డీప్ ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు
 
2. కారంగా ఉండే ఆహారం
 
3. ఆల్కహాల్
 
4. పాల ఉత్పత్తులు
 
5. పండకుండా వున్నటువంటి పండ్లు
 
6. శుద్ధి చేసిన ధాన్యాలు
 
7. అధిక ఉప్పు పదార్థాలు
 
8. ఐరన్ సప్లిమెంట్స్, కొన్ని ఇతర మందులు
 
9. అధిక ఫైబర్
 
పైల్స్ తగ్గించుకోవడం ఎలా?
ముల్లంగి రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే పైల్స్‌కు సాధారణ నివారణ అని చెపుతారు. 1/4 వ కప్పుతో ప్రారంభించి, క్రమంగా రోజుకు రెండుసార్లు సగం కప్పుకు పెంచుతూ తాగితే ఉపశమనం కలుగుతుంది.
 
కొబ్బరి నూనె, పసుపు కలపాలి. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనె, పసుపు మిశ్రమాన్ని శక్తివంతమైన కలయికగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని కాటన్‌తో తీసుకుని పైల్స్ వున్న ప్రాంతంలో సుతిమెత్తగా అద్దాలి. అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.
 
వెంటనే రిలీఫ్ కోసం
గోరువెచ్చని నీటిలో కూర్చోవడం (సిట్ బాత్) గొప్ప ఉపశమనం ఇస్తుంది.
 
హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు పుష్కలంగా నీరు త్రాగాలి.
 
క్రమం తప్పకుండా వ్యాయామం.
 
ఐనప్పటికీ వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగు రీతిలో చికిత్స తీసుకోవాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెంట్ బిల్లు చుక్కలు చూపిస్తోందా? మీ స్ప్లిట్ ఏసీ గ్యాస్ లీక్‌ అయ్యే వుంటుంది, లక్షణాలేంటి?