గాడిద పాలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది ఆవు పాలకు ప్రసిద్ధ ప్రత్యామ్నాయం. తల్లి పాలకు సమానమైన పోషక లక్షణాలను కలిగి ఉన్నాయి. గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ కొవ్వు, ఎక్కువ ఖనిజాలు, లాక్టోస్ వుంటాయి.
విటమిన్, మినరల్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల గాడిద పాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. పాలు తాగే శిశువులకు ఈ పాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో సహజ యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు వున్నాయి. గుండె- ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
టైప్ 2 డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, గాడిద పాల పొడిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. గాడిద పాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు గాడిద పాలను కూడా తీసుకుంటూ వుండాలని చెపుతున్నారు పోషకాహార నిపుణులు.