కలువపూలు. చెరువుల్లో, నీటి కుంటల్లో, కొలనుల్లో కనబడుతుంటాయి. వీటిని పూజ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. ఈ కలువల్లో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
ఎర్ర కలువల వువ్వుల రేకులు హృదయ సంబంధ సమస్యలను దరిచేరకుండా చేయగలదు. అలాగే శరీరంలో నీరసం లేకుండా చేస్తుంది. ఎర్ర కలువ పువ్వుల రేకులు మరగబెట్టి వాటిని నీళ్ళను కలిపి ఒక కాటన్ వస్త్రంలో వేసి పిండాలి. ఈ వచ్చిన ద్రవంలో పంచదార వేసి తిరిగి సగమయ్యే వరకును మరగబెట్టాలి. ఇలా వచ్చిన దానిని ఔషధంగా తీసుకోవచ్చు. ఐతే ఇలా తీసుకునేముందు సమస్యను బట్టి మోతాదు వుంటుంది కనుక ఆయుర్వేద నిపుణులను సంప్రదించాలి.
74 ఎర్రని కలువ గింజలు, అజీర్ణానికి, కలువ వేర్లు జిగట విరేచనములు, రక్త విరేచనములకును పని చేస్తాయి. వీటిని ఎండబెట్టి పొడుము చేసి తీసుకోవచ్చు. ఎర్ర కలువలే కాకుండా మిగిలిన రంగులతో వున్నవాటిలోనూ ఔషధ గుణాలు వుంటాయి. వాటిని కూడా ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు తీసుకోవచ్చు.