Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఆసియాలో అత్యుత్తమ అండర్‌ ఏ బిలియన్‌ 2020’ ఫోర్బ్స్‌ జాబితాలో కావేరీ సీడ్స్‌; 10 ఏళ్లలో 6వ సారి

Advertiesment
Kaveri Seeds
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (19:17 IST)
హైదరాబాద్‌, అతి ముఖ్యమైన భారతీయ పంటలకు నాణ్యమైన హైబ్రిడ్స్‌ అభివృద్ధి చేయడం కోసం బలీయమైన ఆర్‌ అండ్‌ డీ కలిగిన భారతదేశపు ప్రీమియర్‌ విత్తన కంపెనీలలో ఒకటైన కావేరీ సీడ్స్‌, ఈ సంవత్సరపు ఫోర్బ్స్‌, ‘ఆసియాస్‌ బెస్ట్‌ అండర్‌ ఏ బిలియన్‌’ (ఆసియాలో అత్యుత్తమ బిలియన్‌ లోపు) జాబితాలో నిలిచింది. ఒక బిలియన్‌ డాలర్ల లోపు ఆదాయం కలిగి, స్ధిరమైన వృద్ధిని సాధిస్తున్న 200 ఆసియా- ఫసిఫిక్‌ పబ్లిక్‌ కంపెనీలను ఈ జాబితాలో గుర్తించారు.
 
భారతదేశపు ఆకుపచ్చ విప్లవానికి తోడ్పడాలనే లక్ష్యంతో కావేరీ సీడ్స్‌ను శ్రీ జీవీ భాస్కర్‌ రావు 1976లో ఏర్పాటు చేశారు. నేడు హైబ్రిడ్‌ సీడ్స్‌లో అగ్రశ్రేణి వ్యవసాయ కంపెనీగా ఇది నిలిచింది. ఫోర్బ్స్‌ ఆసియాస్‌ బెస్ట్‌ అండర్‌ ఏ బిలియన్‌ జాబితాలో గతంలో  ఐదుసార్లు అంటే 2010, 2011, 2012, 2013, 2015లో నిలువడంతో పాటుగా ఇప్పుడు ఆరవ సారి 2020లో మరో మారు ఈ జాబితాలో నిలిచింది.
 
ఈ జాబితాలోని కంపెనీలు తమ సహచర కంపెనీలతో పోలిస్తే అమ్మకాలు మరియు లభాలలో వృద్ధి, అతి తక్కువ ఋణ స్ధాయి, బలీయమైన పరిపాలన సహా కంపోజిట్‌ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్కోర్‌ సాధించాయి.
 
ఈ జాబితా గురించి శ్రీ జీవీ భాస్కరరావు మాట్లాడుతూ, ‘‘ప్రతిష్టాత్మక సీడ్‌ కంపెనీగా కావేరీ సీడ్స్‌ ఇప్పుడు వైవిధ్యమైన గుర్తింపును పొందడంతో పాటుగా, బలీయమైన, స్ధిరమైన రేపటి కోసం పునాది వేసింది. గత మూడుదశాబ్దాలుగా భారతీయ విత్తనమార్కెట్‌లో బెంచ్‌మార్క్‌ను కావేరీ సీడ్స్‌ సృష్టించింది. మా శ్రేణి మెరుగైన హైబ్రిడ్స్‌, ఆర్‌ అండ్‌ డీ సామర్థ్యంలను బలోపేతం చేసుకోవాలనే మా నిబద్ధత సాటిలేని ఫలితాలను అందించాయి. 
 
కంపెనీ విజయానికి మా ఉద్యోగులు, వినియోగదారులు, రైతులే కారణం. ప్రాధాన్యతా భాగస్వామిగా మేమెల్లప్పుడూ మన దేశానికి వెన్నుముకగా నిలిచే చిన్న, మధ్య తరహా రైతుల జీవితాలను సుసంపన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాం..’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్.పి. బాలు గారికి “భారత రత్న” ఇవ్వాలి: జయప్రద