బంగారం ధరలు ఢమాల్... నేలచూపులు చూస్తూ...

గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:05 IST)
ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు 405 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 32,385కి పడిపోయింది. దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
మరోవైపు వెండి ధర కూడా బాగా తగ్గింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు బాగా మందగించడంతో కేజీ వెండి ధరపై 104 రూపాయలు తగ్గి, 38,246కు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చంద్రబాబు వెన్నులో వణుకు... ఎమ్మెల్యే - ఎంపీ అభ్యర్థులకు ఆహ్వానం