బంగారం రేట్లకు మళ్లీ రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,25,510 వద్ద స్థిరపడింది.గ్రాము బంగారం ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్లపై రూ.33 తగ్గి రూ.12,551 ఉండగా, 22 క్యారెట్లపై రూ.30 తగ్గి రూ.11,505 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు, వెండి ధరలు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వెండి ధర భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజే కిలో వెండిపై రూ.2,000 పెరిగింది. అంతకుముందు రెండు రోజుల్లో వరుసగా రూ.4,500, రూ.3,000 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా రూ.9,500 పెరిగింది.