నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఆ ఆటోడ్రైవర్. తన ఆటోలో రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం దంపతులు మర్చిపోతే... దాన్ని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. విజయవాడలో ఆటో నడపుతూ జీవనం సాగిస్తున్నాడు చంద్రశేఖర్.
శుక్రవారం ఉదయం వేళ నంద్యాలకు చెందిన సూర్య, లక్ష్మి దంపతులు ఓ వివాహానికి హాజరై మారుతీ నగర్ నుంచి బస్టాండుకి వెళ్లే హడావుడిలో బంగారు నగలు వున్న బ్యాగును ఆటోలో మర్చిపోయి ఆటో దిగి వెళ్లిపోయారు. తన ఆటోలో బ్యాగును గమనించిన డ్రైవర్ చంద్రశేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషనులో అప్పగించారు. 12 తులాల బంగారాన్ని అప్పగించి తన నిజాయితీని చాటుకున్న చంద్రశేఖర్ ను డీఎస్పీ శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు.