Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.200.. మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు

Advertiesment
ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.200.. మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (12:12 IST)
ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువచ్చింది. జీవన్ ప్రగతి పాలసీ అనే పేరిట వచ్చిన ఈ పాలసీ రిటైర్ మెంట్ తరువాతి జీవితాన్ని గడపడానికి ఇది ఉత్తమమైన పాలసీ. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు మరణ బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 
 
అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు మరణించినట్లైతే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తరువాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లైతే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.
 
ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సవంత్సరాలు. గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే కనీసం 12 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మంచిది. 20 ఏళ్ల తరువాత రూ.28 లక్షలు పొందాలంటే రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మంచిది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలోని అసెంబ్లీలో ఓ సొరంగ మార్గం.. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు..?