Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిల్లర వ్యాపారులు- కిరణాల కోసం ‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్

Advertiesment
Flipkart
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:09 IST)
భారతదేశంలో రూపుదిద్దుకున్న ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క డిజిటల్ B2B మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, దేశవ్యాప్తంగా తన సభ్యుల కోసం ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. భారతదేశం ఈ సంవత్సరం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నందున, ఫ్రీడమ్ సేల్ #75reasonstocelebrate అనే థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఐడిఐ సభ్యులకు ఆరువేల విస్తృత ఉత్పత్తుల మీద 75 శాతం వరకు పొదుపులను ఆస్వాదించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. అన్ని స్టోర్‌లు మరియు ఆన్‌లైన్ ఛానెల్‌లలో ఆగస్ట్ 8 నుండి ఆగస్ట్ 15, 2022 మధ్య సేల్ అందుబాటులో ఉండబోతోంది.

 
‘దమ్‌దార్ ఆఫర్స్ ఔర్ దమ్‌దార్ దామ్’ అనే ట్యాగ్‌లైన్‌తో, వాక్-ఇన్ మరియు ఆన్‌లైన్ సభ్యుల కోసం 75 ఫ్రీడమ్ డీల్స్, బ్రాండ్ బిల్ బస్టర్‌లు మరియు మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ఈ సేల్ నిర్వహించబడుతుంది. ఈ జాతీయ-స్థాయి మెగా సేల్ ముఖ్యంగా టైర్ 2 మరియు 3 నగరాల్లోని సభ్యులతో సహా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్లాట్‌ఫారమ్‌లో భాగమైన 1.5 మిలియన్లకు పైగా సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

 
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ బిజినెస్ హెడ్ కోటేశ్వర్ ఎల్ ఎన్ మాట్లాడుతూ, "ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మా ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించడం పట్ల మేము ఆనందంగా ఉన్నాం, ఇది రిటైలర్‌లకు గణనీయమైన ప్రయోజనాలను తేవడంతో పాటు మరింత మెరుగైన విలువను అందించడంలో సహాయపడుతుంది. మా మునుపటి ఫ్రీడమ్ సేల్ ఎడిషన్ అధిక సంఖ్యలో కిరానా సభ్యులు పాల్గొనడాన్ని చూసింది. దీనిని ఈ సంవత్సరం కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము. దీని ద్వారా, మేము చిన్న వ్యాపారులకు మరింత సాధికారతనిచ్చే విధంగా వారి వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి డిజిటల్ కామర్స్‌ని వాడుకోవడాన్ని మరియు విస్తృత వినియోగదారుల స్థావరాన్ని చేరుకోవడంలో వారికి సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాము. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో, మేము భారతదేశం యొక్క B2B ఇ-కామర్స్ ఎకోసిస్టమ్‌ని బలోపేతం చేయడం కొనసాగిస్తాము మరియు చిన్న రిటైలర్‌లు వృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందడానికి ఒక స్థితిస్థాపక నమూనాను సృష్టిస్తాము” అని అన్నారు

 
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన మార్కెట్ అవగాహన, కిరణాలు మరియు సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల కోసం సంపూర్ణ మరియు అర్థవంతమైన వృద్ధి వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ప్లాట్‌ఫారమ్ యొక్క విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా, చిన్న మరియు మధ్యస్థ సంస్థల బ్రాండ్‌లు పాన్-ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో స్థానాన్ని మరియు ఉనికిని పొందుతాయి. ప్లాట్‌ఫారమ్ తన డిజిటల్-ఫస్ట్ విధానం ద్వారా, చిన్న బ్రాండ్‌లకు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అనేక సూచనలను కూడా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స్నేహానికి దేశాలు, సరిహద్దులు లేవు' - పాక్ మహిళతో స్నేహం గురించి భారతీయ మహిళ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసలు