బాంబే స్టాక్ మార్కెట్‍లో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు ఎదురయ్యాయి. అమ్మకాల ఒత్తిడి గురువారం కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది.
సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 77580 వద్ద ముగియగా, నిప్టీ సైతం 26 పాయింట్లు కోల్పోయి 23532 వద్ద ఆగింది. ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, మీడియా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల కొనుగోళ్ల ట్రెండ్ కనిపించడంతో నిఫ్టీలో నష్టాల శాంతి కొద్దిగా తగ్గింది.
కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంంకు, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలను చవిచూడగా, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి.