Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ సానుకూలత - దూసుకెళ్లిన మార్కెట్లు

bse sensex

ఠాగూర్

, బుధవారం, 9 అక్టోబరు 2024 (16:51 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో మార్కెట్లు ఈ రోజు లాభాలను చవిచూశాయి. గత ఆరు సెషన్లుగా నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81,634 పాయింట్లకు చేరుకుంది. అలాగే, నిఫ్టీ సైతం 217 పాయింట్లు లాభపడి 25,013 వద్ద ఆగింది. ఈ రోజు ఆదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, హెచ్.డి.ఎఫ్.సి. ఎల్ అండ్ టి కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అలాగే టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. 
 
మరోవైపు, భారత రిజర్వు బ్యాంకు రెపో రేటును వరుసగా పదోసారి 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటు యధాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యుల సానుకూలంగా ఓటు వేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఎఫ్‌డీఎస్ రేటు 6.25 శాతంగాను, ఎంఎస్ఎఫ్ రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం- మహిళతో వనమా (వీడియో)