Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మురికి- అశుద్ధం-పీరియడ్స్‌ చుట్టూ ఉన్న ఈ అపోహలను పోగొట్టడం కోసం విష్పర్‌

mother
, మంగళవారం, 14 మార్చి 2023 (16:14 IST)
భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు పీరియడ్‌ విద్య, ఉత్పత్తుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల పాఠశాల వదిలేస్తున్నారు. తల్లులే బాలికలకు మొదటి ఉపాధ్యాయురాలు. కానీ ఈ నివేదికలో ప్రతి 10 మంది తల్లుల్లో ఏడుగురికి పీరియడ్స్‌ వెనుక దాగిన సైన్స్‌ పట్ల అవగాహన లేదు. వారు దీనిని మురికి లేదా అశుద్ధం అని భావిస్తున్నారు.
 
గత కొద్ది సంవత్సరాలుగా 10 కోట్ల మందికి పైగా తల్లులు, కుమార్తెలకు ఉచితంగా పాడ్స్‌ అందించడంతో పాటుగా ఋతుక్రమ విద్యను అందించింది. ఈ ప్రచార సమయంలో కొనుగోలు చేసిన ప్రతి విష్పర్‌ అల్ట్రా ప్యాక్‌‌తో మీరు ఒక బాలికకు ఉచితంగా ప్యాడ్స్‌ అందించడంతో పాటుగా ఋతుక్రమ విద్యను అందిస్తుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రతి ఐదుగురు బాలికలలో ఒక బాలిక ఋతుక్రమ విద్య లేకపోవడం చేత పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రతి 10 మంది తల్లుల్లో ఏడుగురికి ఈ ఋతుక్రమం పట్ల అవగాహన లేదు మరియు దానిని వారు అశుద్ధం లేదా మురికి అని భావిస్తున్నారు. తల్లులే తమ పిల్లలకు తొలి ఉపాధ్యాయురాలు. కాబట్టి వారు తమ పిల్లలకు సరైన విద్యనందించగలరు.
 
‘‘ఈ సంవత్సరం మేము తల్లులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకున్నాము. మా లక్ష్యమేమిటంటే, బాలికలు తమ పాఠశాల విద్య పూర్తి చేసుకుని తమ కలలను చేరుకునేలా తోడ్పడడం. మా వినియోగదారులు మాకు సహాయం చేయడం ద్వారా భారీ మార్పును తీసుకురావడంలో తోడ్పడగలరు. విష్పర్‌ అల్ట్రా శానిటరీ న్యాప్‌కిన్‌ల ప్రతి ప్యాక్‌ కొనుగోలుపై ఋతుక్రమ విద్యను అందించడంతో పాటుగా ఉచిత ప్యాడ్‌లను సైతం బాలికలకు అందించడం ద్వారా ఆమెను పాఠశాలలో ఉంచడంలో సహాయం చేస్తున్నాము’’ అని ప్రోక్టర్‌ అండ్‌ గాంబెల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కేటగిరి లీడర్‌, ఫెమినైన్‌ కేర్‌ గిరీష్‌ కళ్యాణరామన్‌ అన్నారు.
 
ఈ కారణానికి తమ మద్దతు తెలిపిన నటి మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, ‘‘బాలికలకు పీరియడ్స్‌ గురించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. కీప్‌గాళ్స్‌ ఇన్‌ స్కూల్‌ ప్రచారంతో విస్పర్‌ అద్భుతమైన కార్యక్రమం చేస్తుంది. దీనితో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఋతుక్రమం గురించి చర్చ జరగాల్సిన సమయమిది. బాలికలను పాఠశాలల్లో ఉంచడం ద్వారా వారి వ్యక్తిగత వృద్ధిలో మాత్రమే కాదు, మన సమాజ అభివృద్ధికి సైతం తోడ్పడగలము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ ... ఇప్పటికే ముగ్గురు మృతి