Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు అతిపెద్ద కార్పోరేట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ పరిచయం చేసిన ఎథర్‌ ఎనర్జీ

Ether Energy
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (23:18 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీదారు, ఎథర్‌ ఎనర్జీ నేడు తమ అతిపెద్ద కార్పోరేట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ ను ప్రారంభించడం ద్వారా దేశంలో ఈ-మొబిలిటీని ప్రోత్సహిస్తుంది. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని 2500కు పైగా సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో కార్పోరేట్‌ ఉద్యోగులు ఎథర్‌ స్కూటర్లను కొనుగోలు చేసిన ఎడల మొత్తంమ్మీద 16,259 రూపాయల ప్రయోజనాలను పొందగలరు.  ఈవీ రంగంలో సుప్రసిద్ధ సంస్థగా, ఈ కార్యక్రమంతో ఈవీల స్వీకరణను ఎథర్‌ మరింత వేగవంతం చేయనుంది.
 
నేటితో ప్రారంభించి, గతంలో ఎన్నడూ వినని రీతిలో ఆఫర్లను కార్పోరేట్‌ ఉద్యోగుల కోసం ఎథర్‌ పరిచయం చేసింది. దీనిలో భాగంగా 4000 రూపాయల కార్పోరేట్‌ రాయితీ, 4000 రూపాయల విలువ కలిగిన మార్పిడి బోనస్‌ మరియు ఎథర్‌ కొనుగోలు చేసిన ఎడల తీసుకునే ఋణాలపై  పన్నుల ఆదా చేసుకోవడం చేయవచ్చు. ఉత్పత్తి కోణంలో చూస్తే , ఎథర్‌ ఇప్పుడు కాంప్లిమెంటరీగా 8,259 రూపాయల విలువ కలిగిన (450 X పై మాత్రమే) రెండు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ (తయారీదారు అందించే మూడు సంవత్సరాల వారెంటీ కంటే అదనం) అందిస్తుంది. ఈ ఆఫర్లు 28 ఫిబ్రవరి 2023 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎథర్‌ ఎనర్జీ ఇప్పుడు వర్క్‌ప్లేస్‌ల వద్ద కాంప్లిమెంటరీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను సైతం అందిస్తుంది.
 
సస్టెయినబల్‌ ఎనర్జీ దృష్టి సారించి ప్రభుత్వంతో పాటుగా కార్పోరేషన్‌లు గ్రీన్‌ మొబిలిటీ దిశగా పయణించేందుకు పలు కార్యక్రమాలను పరిచయం చేయడంతో పాటుగా 2070 నాటికి నెట్‌ జీరో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆఫీస్‌ ప్రాంగణాలలో చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా చార్జింగ్‌ ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కార్పోరేట్‌ ఆఫర్లు సుప్రసిద్ధ సంస్ధలైనటువంటి రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌, విప్రో టెక్నాలజీస్‌, శాంసంగ్‌ ఇండియా, మింత్రా, టాటా టెక్నాలజీస్‌, ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌  ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది.
 
ఎథర్‌ ఎనర్జీకి  ప్రస్తుతం విస్తృత శ్రేణిలో  రిటైల్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా ఉంది. దాదాపు 80 కు పైగా నగరాలలో 100కు పైగా ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు విస్తృత స్ధాయిలో విస్తరించేందుకు తగిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. భారతదేశంలోని టియర్‌ 1, టియర్‌ 2, టియర్‌ 3 నగరాల లో  సైతం విస్తరించడం ద్వారా మార్చి 2023 నాటికి 100 నగరాలలో తమ కేంద్రాల సంఖ్యను 150 కు చేర్చనుంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించి అతి పెద్ద ఫాస్ట్‌ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఎథర్‌ ఎనర్జీకి ఉంది.  దేశవ్యాప్తంగా 900కు పైగా ఎథర్‌ గ్రిడ్స్‌ను సంస్థ అందుబాటులో ఉంచింది.
 
ఎథర్‌ ఎనర్జీ ఈ సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించింది. జనవరి 2023లో  తమ నెలవారీ అత్యుత్తమ విక్రయాలను నమోదు చేస్తూ 12,419 యూనిట్లను విక్రయించింది.  దేశంలో వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఎథర్‌ తమ రెండవ తయారీకేంద్రాన్ని హోసూరులో ప్రారంభించింది. ఈ కేంద్రం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఉంటుంది. ఈ సదుపాయంతో తమ ఉత్పత్తి సామర్థ్యంను 2024 ఆర్ధిక సంవత్సరం (ఏప్రిల్‌ 2023– మార్చి 2024) నాటికి సంవత్సరానికి 4,20,000 యూనిట్లకు విస్తరించనుంది. తద్వారా తమ ప్రతిష్టాత్మక స్కూటర్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ అవసరాలను సైతం తీర్చనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్యూర్‌ ఈవీ విద్యుత్‌ మోటర్‌సైకిల్‌ జస్ట్ రూ. 99,999