Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో మరో రెండు కొత్త ఎథర్‌ ఎనర్జీ కేంద్రాలు ప్రారంభం

Ether Energy
, మంగళవారం, 3 జనవరి 2023 (16:52 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ విద్యుత్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ. తెలంగాణాలో తమ రిటైల్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ రెండు నూతన ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను ప్రైడ్‌ ఎలక్ట్రిక్‌ భాగస్వామ్యంతో సికింద్రాబాద్‌లోని ఆర్‌పీ రోడ్‌ వద్ద మరియు రామ్‌ గ్రూప్‌ సహకారంతో సోమాజీగూడా సర్కిల్‌ వద్ద అమిత్‌ ప్లాజా వద్ద  ప్రారంభించింది. మూడవ తరపు ఎథర్‌ యొక్క  ప్రతిష్టాత్మకమైన స్కూటర్‌లో 450జి మరియు 450 ప్లస్‌ లు టెస్ట్‌ రైడ్‌ మరియు కొనుగోలు కోసం ఎధర్‌ స్పేస్‌ వద్ద లభ్యమవుతాయి.
 
దీర్ఘకాలపు పర్యావరణ అనుకూల పరిష్కారంగా ఈవీల సామర్ధ్యంను హైదరాబాద్‌లో అధికశాతం మంది వినియోగదారులు గుర్తించారు. ఈ రెండు నూతన ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాల ఆవిష్కరణతో వినూత్నమైన యాజమాన్య అనుభవాలను అందించడంతో పాటుగా యజమానులకు పూర్తి స్థాయిలో సేవలు మరియు మద్దతును అందిస్తాయి. వినియోగదారులకు విద్యుత్‌ వాహనాల పట్ల అవగాహన కల్పించేలా దీనిని రూపకల్పన చేశారు. అదే సమయంలో ఇంటరాక్టివ్‌ ప్రాంగణంలో సమగ్రమైన అనుభవాలను ఎథర్‌ స్పేస్‌ అందిస్తుంది. ఎథర్‌ స్పేస్‌ ఇప్పుడు వినియోగదారులకు వాహనానికి సంబంధించి ప్రతి అంశాన్నీ తెలుసుకునే  అవకాశం అందిస్తుంది. అదే సమయంలో పలు భాగాలను గురించి సమగ్రమైన  అవగాహనను సైతం కల్పిస్తూ వాటిని ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం సందర్శించక మునుపే ఎథర్‌ ఎనర్జీ యొక్క వెబ్‌సైట్‌పై వారు టెస్ట్‌ రైడ్‌ స్లాట్స్‌ను సైతం బుక్‌ చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా రవ్నీత్‌ సింగ్‌ ఫొకేలా, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, ఎథర్‌ ఎనర్జీ మాట్లాడుతూ, ‘‘నగరంలో మా మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి మేము మా స్కూటర్‌లకు అపూర్వమైన స్పందనను అందుకుంటూనే ఉన్నాము. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ అసాధారణంగా పెరిగింది. స్ధిరత్వం, నాణ్యత, విశ్వసనీయత కోసం ఈవీల వైపు చూస్తున్నారు. వీరు కోరుకునే అంశాలను ఎథర్‌ విస్తృత స్థాయిలో అందిస్తుంది. రాబోయే నెలల్లో రాష్ట్రంలో వృద్ధి స్ధిరంగా కనిపించనుందని ఆశిస్తున్నాము. ఈ డిమాండ్‌ను మా వేగవంతమైన విస్తరణ ప్రణాళికలు తీర్చడంలో సహాయపడగలవని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
‘‘గత రెండు సంవత్సరాలుగా ఎథర్‌ ఎనర్జీతో మా భాగస్వామ్యం అత్యంత ఉత్సాహపూరితంగా సాగుతుంది. ఎలాంటి నూతన సాంకేతికతను అయినా స్వీకరించడంలో హైదరాబాద్‌ వినియోగదారులు అత్యంత చురుకుగా ఉంటుంటారు. విద్యుత్‌ ద్విచక్రవాహనాల వరకూ విప్లవాత్మక సాంకేతికతను తీసుకురావడంలో ఎథర్‌ ఎనర్జీ అగ్రగామిగా ఉంది. గత రెండు సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ పట్ల మా నమ్మకం మరియు విశ్వాసం గణనీయంగా వృద్ధి చెందింది. ఇప్పుడు సికింద్రాబాద్‌ ప్రాంత వాసులకు సైతం సేవలను అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని  ప్రైడ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, శ్రీ సురేష్‌ రెడ్డి అన్నారు.
 
‘‘విద్యుత్‌ స్కూటర్‌లను అత్యంత జాగ్రత్తగా డిజైన్‌ చేయడం ద్వారా భారతదేశంలో ద్వి చక్రవాహన సవారీ అనుభవాలను ఎథర్‌ ఎనర్జీ పునర్నిర్వచించింది. ఎథర్‌ ఎనర్జీ యొక్క అభివృద్ధి చెందుతున్న మరియు వినూత్నమైన ఉత్పత్తులు చక్కగా ప్రణాళిక చేయబడటంతో పాటుగా మెరుగైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను కలిగిఉన్నాయి. వినియోగదారుల అనుభవాలను మరింత మెరుగుపరిచే రీతిలో క్లయింట్‌ సేవలను నిర్మించడం జరిగింది. రామ్‌ గ్రూప్‌ వద్ద, మేము విద్యుత్‌ రవాణా భవిష్యత్‌ ఇక్కడ ఉందని ఆశిస్తున్నాము. దానిని వాస్తవం చేయడం కోసం, ఎథర్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో విద్యుత్‌ స్కూటర్‌లను మరింతగా చేరువ చేయడంపై దృష్టిసారించాము’’ అని రామ్‌ గ్రూప్‌కు శివతేజ వర్మ అన్నారు.
 
చార్జింగ్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై పెట్టుబడులు పెట్టిన అతి కొద్ది ఓఈఎంలలో ఎథర్‌ ఎనర్జీ ఒకటి. ఈ కంపెనీ 40కు పైగా చార్జర్లు హైదరాబాద్‌ నగరంలో ఉన్నాయి మరియు 2023 ఆర్థిక సంవత్సరాంతానికి 50కు పైగా చార్జర్లను  ఏర్పాటు చేయడంతో పాటుగా తమ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను మరింతగా బలోపేతం చేయడానికి ప్రణాళిక చేసింది. తమ ఫ్లాట్స్‌, భవంతులలో హోమ్‌ చార్జింగ్‌ సిస్టమ్స్‌ను వినియోగదారులు ఏర్పాటుచేసేందుకు అవసరమైన మద్దతును సైతం ఎథర్‌ ఎనర్జీ అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎథర్‌ ఎనర్జీకి 800కు పైగా ఎథర్‌ గ్రిడ్స్‌ ఉన్నాయి.
 
భారీ బ్యాటరీ ప్యాక్‌ 3.7 కిలోవాట్‌ హవర్‌తో పాటుగా విశాలవంతమైన మిర్రర్స్‌, వెడల్పాటి టైర్లు కలిగిన నూతన ఎథర్‌ జెన్‌ 3 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మెరుగైన పనితీరు అందిస్తాయి. వినియోగదారుల డాటా ఆధారంగా, ఈ అప్‌గ్రేడ్స్‌ను వారి కొనుగోళ్లకు తగిన అత్యుత్తమ ధరను అందించే రీతిలో ఉన్నాయి. నూతన 450 గీ జెన్‌ 3 మరియు 450పప్‌ జెన్‌ 3 వృద్ధి చేసిన ట్రూ రేంజ్‌ వరుసగా 105 కిలోమీటర్లు మరియు 85 కిలోమీటర్ల శ్రేణిలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో 7.0 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఇంటర్‌ఫేజ్‌,రీజెన్‌తో ఫ్రంట్‌, రియర్‌ డిస్క్‌ బ్రేక్స్‌, 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Poco నుంచి Poco C50ని లాంచ్.. ఫీచర్స్ ఇవే