Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్, నవంబర్ 21న మెటా రే-బాన్ ప్రారంభోత్సవంతో ప్రీమియం వేరబుల్స్ ఆఫర్

Advertiesment
Amazon

ఐవీఆర్

, గురువారం, 20 నవంబరు 2025 (23:28 IST)
అమెజాన్ పైన నవంబర్ 21, 2025న మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్‌లు ప్రారంభమవుతాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వేరబుల్ శ్రేణుల్లో ఒక దానికి లభ్యతను విస్తరిస్తోంది. ఇది ప్రీమియం వేరబుల్ శ్రేణిగా పరిగణన చేయబడుతుంది. అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025 సమయంలో సుమారుగా 40% వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ లు చేసిన సెర్చ్ లలో స్మార్ట్ గ్లాస్ లు వార్షికంగా 4.6 X పెరిగాయి.
 
ఫిట్ నెస్ ట్రాకింగ్‌ని మించి ధరించగలిగే డివైజ్ లపై శక్తివంతమైన కస్టమర్ ఆసక్తిని మేము చూస్తున్నాము - AI సామర్థ్యాలను రోజూవారీ క్షణాల్లోకి తీసుకువచ్చే డివైజ్‌లు అని అమేజాన్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జేబా ఖాన్ అన్నారు. ఈ డిమాండ్ మెట్రోస్‌కి మాత్రమే పరిమితం కాలేదు- టియర్ -2 మరియ టియర్ -3 నగరాల్లోని టెక్ ఔత్సాహికులు, క్రియేటర్లు కూడా స్మార్ట్ గ్లాసెస్‌ను ఎంతో కుతూహాలంతో అనుసరిస్తున్నారు. ఈ డివైజ్‌లు హ్యాండ్స్ -ఫ్రీ సదుపాయంతో, రోజూవారీ జీవితంలోకి సజావుగా కలిసిపోయే AI-పవర్డ్‌తో పని చేస్తాయి. పోటీయుత ధరలకు, నమ్మకమైన డెలివరీతో భారతదేశంలో అందుబాటులో ఉండేలా మేము చర్యలు తీసుకుంటున్నాము.
 
రే-బాన్ మెటా గ్లాస్ లు బిల్ట్-ఇన్ 12MP అల్ట్రా-వైడ్ కెమేరా, అయిదు మైక్రోఫోన్స్, మెటా AI పని విధానంతో ఓపెన్-ఇయర్ స్పేషియల్ ఆడియో స్పీకర్స్ ను కలిపాయి. యూజర్లు ఫోటోలు తీయవచ్చు, కాల్స్ చేయవచ్చు, రిమైండర్లు పెట్టవచ్చు, మరియు AI అసిస్టెన్స్ హ్యాండ్స్-ఫ్రీని పొందవచ్చు. కస్టమర్లు నవంబర్ 21 నుండి మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాస్‌లను అమెజాన్ పైన అన్వేషించవచ్చు, 20 కంటే ఎక్కువ నగరాల్లో అదే రోజు డెలివరీ, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ మరియు ఇతర ప్రారంభోత్సవపు ఆఫర్లతో లభిస్తున్నాయి.
 
అమేజాన్ ఇండియా వారి ప్రీమియం వేరబుల్స్ ఎంపిక యాపిల్, శామ్ సంగ్, గర్మిన్, వన్ ప్లస్, అమేజ్ ఫిట్ వంటి సహా 15 కంటే ఎక్కువ బ్రాండ్స్ లో విస్తరించింది. ఆరోగ్యాన్ని ట్రాకింగ్ చేయడం నుండి ఫిట్నెస్‌ను పర్యవేక్షించే హ్యాండ్స్-ఫ్రీ కనక్టివిటీ, AI అసిస్టెన్స్ వంటి ఆధునిక ఫీచర్లను అందించే ప్రీమియం ఉత్పత్తుల్లో కస్టమర్లు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు-ప్రాథమిక ఫిట్ నెస్ ట్రాకర్స్ నుండి జీవనశైలిలో కలిసిపోయిన టెక్నాలజీకి ఇది మార్పును సూచిస్తోంది.
 
కస్టమర్లు మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను నవంబర్ 21 నుండి అమెజాన్ పైన అన్వేషించవచ్చు. భారతదేశంలో 100% సేవలు అందగలిగే పిన్ కోడ్స్‌లో డెలివరీలు అందచేస్తుంది. నో-కాస్ట్ EMI ఎంపికలు, ప్రత్యేకమైన ప్రారంభోత్సవ ఆఫర్లతో పాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, జైపూర్, కొల్ కత్తా సహా 20 కంటే ఎక్కువ నగరాల్లో అదే రోజు డెలివరీ లభ్యం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు వైపు అడుగులు: భారత సుస్థిర ప్యాకేజింగ్ మార్పు దిశగా బయో రీఫార్మ్