Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏజి అండ్ పి ప్రథమ్ రూ. 400 కోట్లు పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు

photo
, శుక్రవారం, 27 మే 2022 (16:07 IST)
బలమైన పైప్ లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలసి పని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో, ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే ఐదేళ్లలో అనంతపురం జిల్లాలో రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు జిల్లాలో 1000 మందికి పైగా ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కూడా అందిస్తాయి.

 
భారతదేశ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ వినియెగదారుల వంటశాలలకు సహజ వాయువును అందించడానికి, రవాణా రంగం కోసం సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్లకు సహజ వాయువుని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లోని 4 జిల్లాలలో అంతటా గ్యాస్ పైప్ లైన్ నెట్వర్కును ఈ జీ అండ్ పీ ప్రథమ్ ఈ జిల్లాలోని అనంతపురంలో ఎల్ సీ ఎన్ జీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది.

 
అనంతపురం నగరానికి దేశీయ గ్యాస్, సీఎన్జీలను సమర్థంగా అందించేలా ఈ ప్లాంటు ఉంది. అనంతపురం ఎల్ సీ ఎన్జీ నిర్మాణంలో అనంతపురం జిల్లా ప్రజలకు వారి ఇంధన బిల్లు ఖరీదు అయిన పెట్రోలు కంటే 50% తగ్గించడం, ఎల్ పీ జీ సిలిండర్ కంటే వంట ఇంధనంలో 20% ఆదా చేయడం సాధ్యమవుతాయి. దాంతోపాటు, పారిశ్రామీకరణను వేగవంతం చేసే, ఉద్యోగాలను సృష్టించే, కాలుష్యాన్ని తగ్గించే, సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించే సహజవాయువును అందించడం ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.    

 
ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ అనంతపురం జిల్లా ప్రాంతీయాధిపతి వెంకటేశ్ మాట్లాడుతూ, "అనంతపురమును స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోంది. ఇందుకోసం చవకైన సహజవాయువును సులభంగా అందిస్తోంది. దీనితో ఈ జిల్లా ప్రజలు తమ జీవితాలను మరింత సుఖంగా గడపగలరు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మరింత విస్తృతంగా అలోచించి, ఏజీ అండ్ పీ ప్రథమ్ అనంతపురంలో ఎల్ సీఎన్ జీ స్టేషన్ పెట్టాలని నిర్ణయించింది.


పెట్రోలియం&నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీ ఆర్బీ) సహజ వాయువు పైప్ లైన్ విషయంలో నిర్దేశించిన భద్రతా ప్రమాణాలతో సహా, అనేక డిమాండ్ సెంటర్లకు గ్యాస్ సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ఎల్ సీఎన్‌జీ స్టేషన్ స్థాపన, అన్ని సాంకేతిక పరిమాణాలు, స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉంది. అనంతపురం రూరల్ రాప్తాడు మండలం పరిధిలోకి వచ్చే జంక్షన్లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెనకబడిన ప్రాంతమైన జిల్లాలో పారిశ్రామీకరణను వేగవంతం చేయడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి, తద్వారా పౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడానికి, సహజ వాయువుని అందించడం ద్వారా ఈ స్టేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వైకాపా సామాజిక న్యాయభేరీ యాత్ర