Publish Date: Fri, 03 Dec 2021 (23:25 IST)
Updated Date: Fri, 03 Dec 2021 (23:28 IST)
శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. కొందరికి పగుళ్లు కూడా వస్తాయి. ఇలాంటి వారు చర్మ రక్షణకు విటమిన్ సి లేదా ఇ కలిగిన లోషన్‌లు రాసుకోవాలి. ఆయిలీ స్కిన్ వున్నవాళ్లు కొంచెం తేనె, పెరుగు, దోసకాయ, కమలాపండు రసం మిశ్రమం చేసుకుని ముఖానికి పట్టించుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
పొడి చర్మం ఉన్నవారు అరటిపండు, తేనె, పాలు కలిపి రాసుకుంటే చర్మంలో మార్పు వస్తుంది. చర్మం పొడిబారినట్టుగా, ఉంటే పాలలో దూదిని ముంచి, ముఖమంతా రాసి, తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఈ విధంగా చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిబారదు. మృతకణాలు తొలగిపోతాయి.
చర్మం పొడిబారి, తెల్లగా ఉంటే ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి రోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. టీ స్పూన్ వెన్నలో చిటికెడు పసుపు వేసి కలిపి, ముఖానికి చేతులకు పట్టించి పది నిమిషాలుండాలి. తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. అరటిపండు గుజ్జు, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. తర్వాత వేళ్లతో రెండు నిమిషాలు మర్ధనా చేస్తూ మెత్తటి కాటన్ టవల్‌తో ముఖమంతా అద్దాలి. చలికాలంలో రోజూ ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
సిహెచ్
Publish Date: Fri, 03 Dec 2021 (23:25 IST)
Updated Date: Fri, 03 Dec 2021 (23:28 IST)