Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దానిమ్మ తొక్కతో సౌందర్యం... తెలిస్తే ఆశ్చర్యపోతారు...

Advertiesment
beauty benefit
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (22:14 IST)
మనం బయట పడేసే పండ్లు మరియు కూరగాయల తొక్కలు పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయని మీకు తెలుసా..... అవును ఇవి ఎంతగానో చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా దానిమ్మ పండు తొక్క వలన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. దానిమ్మ పండు తొక్కలను చూర్ణ లేదా పొడి రూపంలో కూడా వాడవచ్చు. గాలి చొరబడని బాటిలో ఉంచి కొన్ని నెలల వరకు దానిమ్మ తొక్క పొడిని దాచుకొని వాడవచ్చు. ఈ  పొడితో మాస్క్‌ను, ఫేస్ ప్యాక్ లేదా ముఖ తయారీకి వాడే ఇతర ఉత్పత్తులలో కూడా వాడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. దానిమ్మ పండు తొక్క అనేక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా ఈ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు ఆస్ట్రిజెంట్ (రక్తస్రావనివారిణి) గుణాలను కూడా కలిగి ఉండే ఈ తొక్క, చర్మాన్ని ఉద్దీపనలకు గురి చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.
 
2. యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆస్ట్రిజెంట్ గుణాలను కలిగి ఉండే దానిమ్మ పండు తొక్క, చర్మ రంద్రాల పరిమాణాన్ని తగ్గించి, చర్మ  నిర్మాణాన్ని కట్టడి చేసి, చర్మం సాగటం వంటి వాటికి దూరంగా ఉంచటం వలన దీనిని యాంటీ- ఏజింగ్ ఔషధంగా కూడా వాడవచ్చు. 
 
3. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ వారు తెలిపిన దాని ప్రకారం, దానిమ్మ తోలు చర్మాన్ని మరమ్మత్తుకు గురి చేసి మరియు అంతశ్చర్మం (డేర్మిస్) యొక్క పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
 
4. దానిమ్మ పండు నుండి తొక్కను వేరు చేసి, దంచండి. రెండు చెంచాల క్రీమ్ మరియు ఒక చెంచా ముడిశెనగలు పొడిని, ఒక  చెంచా దంచిన దానిమ్మ తొక్క చూర్ణానికి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, ముఖానికి మరియు మెడకు ఆప్లై చేయండి. ఇలా 30 నిమిషాల పాటూ వేచి ఉన్న తరువాత, గోరువెచ్చని నీటితో కడిగి వేయండి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 
5. దీనిని వాడే మరొక మార్గం ఏంటంటే... తాజా దానిమ్మ పండు తొక్కను తీసుకొని దంచి, ఎండిపోయిన చూర్ణ రూపంలో ఉండే దీనిని రోజ్‌వాటర్‌కు కలిపి పేస్ట్ వలే తయారుచేయండి. ఈ పేస్టును మీ ముఖానికి మరియు మెడకు అప్లై చేసి ఎండిపోయే వరకు వేచి ఉండండి. గోరువెచ్చని నీటితో కడిగి వేసి, తేమను అందించే ఉత్పత్తులను వాడండి. ఇలా చేయటం వలన మీరు యవ్వనంగా కనపడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేస్టీ వెజిటబుల్ పకోడి ఎలా చేయాలో తెలుసా?